Pranab Mukhergee: ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్

నాన్న పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, మరీ అంతగా దిగజారిపోలేదని కూతురు షర్మిష్ట ట్వీట్ చేశారు. వెలుతురుకు ఆయన కళ్లు స్పందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 14, 2020, 3:15 PM IST
Pranab Mukhergee: ప్రణబ్  ముఖర్జీ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్
ప్రణబ్ ముఖర్జీ (File)
  • Share this:
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఐనప్పటికీ ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విటర్ ద్వారా తెలిపారు. 96 గంటల అబ్జర్వేషన్ పీరియడ్‌ నేటితో ముగియనుందని.. వైటల్ పారామీటర్స్ స్టేబుల్‌గానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తనకు ఎంతో చేశారంటూ నాతో చెప్పేవారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు అభిజిత్. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రణబ్ కుమారుడు.



నాన్న పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, మరీ అంతగా దిగజారిపోలేదని కూతురు షర్మిష్ట ట్వీట్ చేశారు. వెలుతురుకు ఆయన కళ్లు స్పందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సమిష్టి ప్రార్థనలపై తనకు చాలా నమ్మకం ఉందని, నాన్న కోలుకోవాలని కోరుతూ ప్రార్థనలు కొనసాగించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు షర్మిష్ట.


ప్రణబ్ ముఖర్జీ ఐదు రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఐతే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కుమారుడు అభిజిత్ ముఖర్జీ, కూతురు షర్మిష్ట ముఖర్జీ ఖండించారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించిన విషయం తెలిసిందే. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ అన్ని పార్టీల నేతలు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు
Published by: Shiva Kumar Addula
First published: August 14, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading