Home /News /national /

PRAMOD SAWANT TAKES OATH AS GOA CM FOR SECOND TERM IN PRESENCE OF PM MODI PVN

Goa CM : మోడీ సమక్షంలో..గోవా సీఎంగా ప్రయోద్ సావంత్ ప్రమాణ స్వీకారం


గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ సావంత్

గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ సావంత్

Goa CM : గోవాకు రెండుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 7వ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డ్ సృష్టించారు. ప్రమోద్ సావంత్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రమోద్ సావంత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 2019 మార్చిలో పారికర్ మరణం తర్వాత సావంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.సావంత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యునిగా పనిచేశారు.

ఇంకా చదవండి ...
Pramod Sawant Takes Oath as Goa CM:ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 40 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 20 స్థానాలను గెలుచుకుని బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీకి మెజారిటీ సంఖ్య కంటే ఒక సీటు తక్కువగా ఉంది. అయితే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు మద్దతు ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. ఈ నేపథ్యంలో గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ రెండోసారి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గోవా రాజధాని పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై సావంత్‌ తో ప్రమాణం చేయించారు. గోవా ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌ వెలుపల ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కేబినెట్ మంత్రులుగా విశ్వ‌జిత్ రాణే, మౌవిన్ గోదిన్‌హో, రావి నాయ‌క్, నైలేష్ కాబ్ర‌ల్, సుభాష్ శిరోధ్క‌ర్, రోహ‌న్ కౌంటే, గోవింద్, గౌడే, అటాన్షియో మాన్‌సెరేట్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు. రెండోసారి సీఎంగా ప్ర‌మాణం చేసిన ప్ర‌మోద్ సావంత్‌,కేబినెట్ మంత్రులకు గ‌వ‌ర్న‌ర్ శ్రీధ‌ర‌న్, ప్ర‌ధాని మోడీతో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. గోవాలో ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నట్లు, గోవా ప్రజలకు మంచి పాలన అందించాలని ప్రధాని మోడీ సూచించారు.

ALSO READ Taliban New Order: మహిళల విమాన ప్రయాణాలపై తాలిబన్ సంచలన నిర్ణయం

కాగా,గోవాకు రెండుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన 7వ వ్యక్తిగా ప్రమోద్ సావంత్ రికార్డ్ సృష్టించారు. ప్రమోద్ సావంత్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రమోద్ సావంత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 2019 మార్చిలో పారికర్ మరణం తర్వాత సావంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.సావంత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యునిగా పనిచేశారు. సావంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సంఘ్ వార్షిక సంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సావంత్ భార్య సులక్షణ కూడా బీజేపీ కార్యకర్త.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Goa, Pm modi

తదుపరి వార్తలు