Home /News /national /

PRAKASH SINGH BADAL GIVES BACK HIS PADMA VIBHUSHAN SUPPORTING FARMERS PROTEST AK

Prakash Singh Badal: పద్మవిభూషణ్ వెనక్కి ఇచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి

ప్రకాశ్ సింగ్ బాదల్ (ఫైల్ ఫోటో)

ప్రకాశ్ సింగ్ బాదల్ (ఫైల్ ఫోటో)

Prakash Singh Badal: రైతులకు మద్దతుగా, కేంద్రం తీరుకు నిరసనగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదల్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    కేంద్రం తీసుకొచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్ర రైతులు ఢిల్లీని ముట్టడించిన సంగతి తెలిసిందే. రైతు బిల్లులు వెనక్కి తీసుకునేంతవరకు తమ నిరసన ఆగదని.. తాము వెనక్కి తగ్గబోమని వారంతా తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మద్దతుగా, కేంద్రం తీరుకు నిరసనగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదల్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తనకు ఇచ్చిన పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను తిరిగి ఇచ్చేశారు. రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదల్ పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన కొద్ది నెలలకే ప్రకాశ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    సెప్టెంబర్‌లో ఎన్డీయే నుంచి అకాలీదల్ బయటకు వచ్చేసింది. కేంద్రం తీసుకొచ్చిన రైతులు బిల్లులకు నిరసనగా తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్టు ఆ పార్టీ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. ఈ బిల్లులు రైతుల పాలిట శాపంగా మారతాయని అన్నారు. అకాలీదల్ బీజేపీకి చిరకాల మిత్ర పార్టీ అని.. అయినా తమ మాటను కేంద్రం వినడం లేదని ఆరోపించారు. టీడీపీ, శివసేన తరువాత ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిన పార్టీగా అకాలీదల్ నిలిచింది. ఇదిలా ఉంటే రైతు బిల్లులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీ చేరుకుని ఆందోళనకు దిగడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేంద్రం.. తాము తీసుకొచ్చిన బిల్లుల విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Farmers Protest, Punjab

    తదుపరి వార్తలు