news18-telugu
Updated: November 21, 2019, 12:36 PM IST
ప్రగ్యా సింగ్ ఠాకూర్ ( ఫైల్ చిత్రం)
బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌కు కీలకమైన కమిటీలో స్థానం కల్పించింది కేంద్రం. రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీకి ఆమెను ఎంపిక చేశారు. 21 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రగ్యా సింగ్ ఠాకూర్... కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌ను ఓడించి లోక్ సభలో అడుగుపెట్టారు. 2008 మాలేగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితురాలిగా ఉన్న ఆమె 2019 మే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరో వివాదం సృష్టించారు. నాథురామ్ గాడ్సేను దేశభక్తుడుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ జోక్యంతో తరువాత ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు. అయితే ఆ తరువాత కూడా ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 21, 2019, 12:36 PM IST