Budget 2019: రైతులకు ఆర్థిక సాయం.. చారిత్రాత్మక నిర్ణయం: పీయుష్ గోయెల్

Union Budget 2019 India: రూ.5లక్షల ఆదాయం లోపు ఉన్న వారు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించాాల్సిన అవసరం లేదన్నారు పీయుష్ గోయెల్.

news18-telugu
Updated: February 1, 2019, 2:35 PM IST
Budget 2019: రైతులకు ఆర్థిక సాయం.. చారిత్రాత్మక నిర్ణయం: పీయుష్ గోయెల్
పీయూష్ గోయల్
  • Share this:
కిసాన్ సమ్మాన్ నిధి పథకం చారిత్రాత్మక నిర్ణయమన్నారు కేంద్ర ఆర్థికమంత్రి పీయుష్ గోయెల్. ఈ బడ్జెట్‌తో రైతుల గౌరవం పెరుగుతుదని..ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని చెప్పారు. ఏసీ గదుల్లో ఉండేవారికి రైతుల కష్టాలు తెలియడం లేదని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. 130 కోట్ల ప్రజల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పీయుష్ గోయెల్.

ఇది పేద, మధ్యతరగతి ప్రజల బడ్జెట్. ప్రతి వర్గానికి మేలు జరగాలన్నదే మా ఆశయం. దేశ సమగ్ర వికాసమే మా లక్ష్యం. రైతుల కోసం మేం తీసుకున్న నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదు. రైతులకు రూ.6వేలు చెల్లించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. ఏసీ రూమ్స్‌లో ఉండే వారికి రైతుల కష్టాలు తెలియవు. అన్నదాత సమస్యలు మోదీ ప్రభుత్వానికితెలుసు. అందుకే బడ్జెట్‌లో రైతులకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం.
పీయుష్ గోయెల్, కేంద్ర ఆర్థికమంత్రి
అసంఘటిత కార్మికులకు నెలకు రూ.3వేల పెన్షన్ చెల్లిస్తామన్నారు పీయుష్ గోయెల్. రూ.5 లక్షల వార్షిక ఆదాయమున్న వేతనదారులు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. పాడి, మత్స్య పరిశ్రమ 2శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు.

First published: February 1, 2019, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading