Home /News /national /

PRADHAN MANTRI KISAN MAANDHAN YOJANA CENTRAL GOVERNMENT PAYS RUPEES 3000 EVERY MONTH UNDER PM KISAN MAANDHAN SCHEME FULL DETAILS HERE NK

PM Scheme: రైతులకు గుడ్‌న్యూస్... ప్రతి సంవత్సరం రూ.36,000... ఇలా పొందండి

ప్రతి సంవత్సరం రూ.36,000... ఇలా పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

ప్రతి సంవత్సరం రూ.36,000... ఇలా పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

PM Scheme: ఇది వరకు చాలా ప్రభుత్వ పథకాలు... ఉన్నా వాటి గురించి లబ్దిదారులకు తెలిసేది కాదు. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చాక... ఇలాంటివి బాగా తెలుస్తున్నాయి. తాజాగా స్కీమ్ ఏంటో తెలుసుకుందాం.

    రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ మంచి పథకం అమల్లో ఉంది. అది సంవత్సరానికి రూ.36,000 పొందేలా చేస్తుంది. ప్రతీ సంవత్సరం ఇలా డబ్బు పొందే ఛాన్స్ ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi yojana) స్కీములో చేరిన వారికి ఈ డబ్బు పొందడం తేలిక అవుతుంది. జనరల్‌గా రైతులంతా ఈ స్కీమ్‌లో చేరారు. కాబట్టి... అందరూ దీన్ని పొందగలరు. గొప్ప విషయం ఏంటంటే... ఈ పథకం కింద రైతులు ఒక్క రూపాయి కూడా అదనంగా చేతిలోంచీ ఖర్చు చెయ్యాల్సిన పని లేదు. కానీ ప్రతి సంవత్సరం రూ.36,000 మాత్రం పొందగలరు. ఆసక్తికరమైన స్కీమ్. ఎలాగో తెలుసుకుందాం.

    దీని పేరు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (Pradhan Mantri Kisan Maandhan Yojana). ఇలాంటి పథకం ఒకటుందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే దీని గురించి పెద్దగా ప్రచారం జరగట్లేదు. పీఎం కిసాన్ పథకంలో చేరిన రైతులు... ఈ పథకంలో తేలిగ్గా చేరగలరు. కిసాన్ మాన్ ధన యోజన అనేది ఒకరకమైన పెన్షన్ స్కీమ్ అని అనుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే... పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన రైతులు... ఈ పథకంలో చేరడానికి ఎలాంటి పత్రాలు, డాక్యుమెంట్లు, ఐడీలూ ఇవ్వాల్సిన పని లేదు. ఈ స్కీమ్ ప్రారంభించడానికి ఎలాంటి ఫీజులూ, ఛార్జీలూ లేవు.

    పథకానికి అర్హతలు:
    ఇది చిన్న, మధ్యతరహా రైతులకు వర్తిస్తుంది. రైతుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రైతులు 2 హెక్టార్ల లోపు భూమిలో వ్యవసాయం చేస్తూ ఉండాలి. ఇప్పటికే ఈ పథకంలో 21,23,809 మంది రైతులు చేరారు.

    ఇలా చెయ్యాలి:
    పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం సంవత్సరానికి రూ.6,000 ఇస్తోంది. ఆ డబ్బును... మాన్ ధన్ యోజన స్కీమ్‌కి మళ్లించవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 దాకా చెల్లించవచ్చు. వయసును బట్టి ఎంత చెల్లించాలో డిసైడ్ చేస్తారు. తక్కువ వయసు ఉన్నవారు తక్కువ చెల్లిస్తారు... ఎక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ చెల్లిస్తారు. ఇలా 60 ఏళ్లు వచ్చేవరకూ డబ్బులు చెల్లించాలి. ఇందుకోసం చేతి నుంచి డబ్బు తియ్యాల్సిన అవసరం లేకుండా... కేంద్రం ఇచ్చే రూ.6000ను వాడుకోవడం మేలు. దీని వల్ల 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పొందగలరు. అలా సంవత్సరానికి రూ.36,000 పొందగలరు. అంటే... ఇదో రకమైన పెన్షన్ స్కీమ్ అనుకోవచ్చు. నెల నెలా డబ్బు వస్తుంది కాబట్టి... రైతులకు అది కొంతవరకూ ఆర్థిక అవసరాలు తీర్చగలదు.

    ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనలో ఇలా చేరండి


    ఎలా చేరాలి?
    ఇది చాలా తేలిక. ముందుగా ఈ వెబ్ ‌సైట్‌ (https://pmkmy.gov.in)లోకి వెళ్లండి. అక్కడ కుడివైపున ఓ మూల క్లిక్ హియర్ టు అప్లై నౌ (Click here to apply now) అనే బాక్సు క్లిక్ చెయ్యాలి.

    ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనలో ఇలా చేరండి


    ఓ కొత్త పేజీ తెరచుకుంటుంది. అక్కడ సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ (Self Enrollment) అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి. మొబైల్ నంబర్‌ ఎంటర్ చేస్తే... ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే... రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత పేరు, ఇతరత్రా మరికొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Business Idea: రూ.50,000 పెట్టుబడితో సంవత్సరానికి రూ.10 లక్షల సంపాదన

    రైతులు 60 ఏళ్లు దాటాక నిశ్చింతగా ఉండేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీన్ని అర్హులైన రైతులంతా ఉపయోగించుకోవాలని కోరుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు