Home /News /national /

PRADHAN MANTRI AWAS YOJANA URBAN EXTENDED TILL DECEMBER 2024 CABINET GIVES NOD CHECK DETAILS UMG GH

PMAY-U: పేదలకు శుభవార్త.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగింపు.. ఎప్పటిదాకా అంటే..?

పేదలకు శుభవార్త.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగింపు..

పేదలకు శుభవార్త.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగింపు..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకాన్ని డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకాన్ని డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది. కాగా, ఇప్పటికే మంజూరైన 122.69 లక్షల ఇళ్లను మార్చి 31లోపు పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. తాజాగా ఈ పథకాన్ని వచ్చే రెండేళ్లకు పొడిగించడం గమనార్హం.

పీఎంఏవై-యూ(PMAY-U) హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులందరికీ పక్కా గృహాలను అందించడం ఈ పథకం లక్ష్యం. 2004-14 మధ్య కాలంలో అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద కేవలం 8.04 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఎన్‌డీఏ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక, 2017లో పీఎంఏవై-అర్బన్ పథకం కింద కోటికి పైగా ఇళ్ల డిమాండ్ ఉన్నట్లు అంచనా.

ఇదీ చదవండి: BGMIపై సంచలన నిర్ణయం.. మొబైల్ గేమ్ నిషేధంపై కంపెనీ రియాక్షన్ ఇదే..!


అప్పటి అంచనాలకు మించి, కోటి రెండు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 62 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మొత్తం మంజూరైన కోటి 23 లక్షల ఇళ్లలో 40 లక్షల ఇళ్ల ప్రతిపాదనలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆలస్యంగా రావడంతో పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పీఎంఏవై-యూ పథకం అమలు వ్యవధిని డిసెంబర్ 31, 2024 వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

2004-14 మధ్య కాలంలో అర్బన్ హౌసింగ్ స్కీమ్‌కు రూ.20,000 కోట్లుగా ఉన్న కేంద్ర సాయం, 2015 నుంచి రూ. 2.03 లక్షల కోట్లకు పెరిగింది. కాగా, మార్చి 31, 2022 వరకు రూ. 1,18,020.46 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. ఇక 2024 డిసెంబర్ 31 వరకు మరో రూ.85,406 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది.



ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం.. దేశంలోని మొత్తం పట్టణ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. చట్టబద్ధమైన పట్టణాలు, నోటిఫైడ్ ప్లానింగ్/డెవలప్‌మెంట్ ప్రాంతాలతో పాటు ఆ తర్వాత నోటిఫై చేసిన పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానంగా బెనిఫిషియరీ-లెడ్ కన్‌స్ట్రక్షన్/ఎన్‌హాన్స్‌మెంట్ (BLC), పార్టనర్‌షిప్‌లో అఫర్డబుల్ హౌసింగ్ (AHP), ఇన్-సిట్ స్లమ్ రీడెవలప్‌మెంట్ (ISSR), క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS) ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకం అమలు అవుతోంది. PMAY(U) పథకంలో ఇప్పుడు డిమాండ్ ఆధారిత విధానాన్ని అవలంభిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీలు (SLNAs), పట్టణ స్థానిక సంస్థలు (ULB)/ అమలు చేసే ఏజెన్సీలు (IAs), సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు (CNAs), ప్రాథమిక రుణ సంస్థలు (PLIs) పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: PM Narendra Modi, PMAY, Pradhan Mantri Awas Yojana, Schemes

తదుపరి వార్తలు