గంభీర్ కనబడటం లేదని పోస్టర్లు

ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై ఏర్పాటు చేసిన సమావేశానికి గౌతమ్ గంభీర్ డుమ్మా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

news18-telugu
Updated: November 17, 2019, 5:37 PM IST
గంభీర్ కనబడటం లేదని పోస్టర్లు
గంభీర్ కనబడటం లేదని వెలసిన పోస్టర్లు
  • Share this:
బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ కనబడుటలేదని ఢిల్లీలో వెలిసిన కొన్ని పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో పోస్టర్లను చెట్లకు కొందరు ఈ పోస్టర్లు అంటించారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా ? అంటూ ఆ పోస్టర్లలో ఉండటం గమనార్హం. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో పొల్యుషన్‌కు సంబంధించిన అంశంపై అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నవంబర్‌ 15న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కీలక సమావేశానికి ఎంపీలు, ప్రభుత్వాధికారులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు.

ఈ సమావేశానికి రాని విపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు నెటిజన్లు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు మాత్రం జిలేబీలు, అటుకులతో చేసిన చాట్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన గౌతమ్ గంభీర్... ఇండోర్‌లో జరిగిన భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్టుకు గౌతీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారంపై గౌతమ్ గంభీర్ స్పందించాల్సి ఉంది.






First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...