• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • POSTERS OF RAHUL GANDHI PRIYANKA AND ROBERT VADRA OUTSIDE AICC OFFICE CONGRESS BLAMES BJP BA

‘మీరే అంటించారు.. కాదు మీరే‘: కాంగ్రెస్-బీజేపీ మధ్య పోస్టర్ ఫైట్

‘మీరే అంటించారు.. కాదు మీరే‘: కాంగ్రెస్-బీజేపీ మధ్య పోస్టర్ ఫైట్

కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా (Image:ANI)

కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇద్దరు క్రిమినల్స్ అంటూ రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాపై బీజేపీ మండిపడింది. అయితే, బీజేపీ వాళ్లే పోస్టర్లు ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్ తిప్పికొట్టింది.

  • Share this:
    కాంగ్రెస్, బీజేపీల మధ్య మరో ఫైట్ జరుగుతోంది. అదే పోస్టర్ వార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ, ప్రియాంకాగాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా ముగ్గురూ కలసి ఉన్న ఫొటో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం బయట అతికించి ఉంది. దీనిపై హస్తం పార్టీని బీజేపీ దుమ్మెత్తిపోసింది. ఆర్థిక కుంభకోణాల్లో ఆరోపితుడైన రాబర్ట్ వాద్రాతో కలసి ఉన్న ఫొటోపై పెను దుమారం రేగింది. ఇద్దరు క్రిమినల్స్ ఫొటోలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బయట అతికించారంటూ బీజేపీ నేత శంబిత్ పాత్రా సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మీద కేసు నడుస్తోంది. రాబర్ట్ వాద్రా మీద మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసింది.

    కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా (Image:ANI)


    రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా పోస్టర్ పెను దుమారం రేపడంతో వెంటనే కాంగ్రెస్ నేతలు దాన్ని తొలగించారు. అయితే, ఆ పోస్టర్‌ను తాము అతికించలేదని, బీజేపీ నేతలే అంటించారని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం చెత్త రాజకీయాలు చేస్తోంది. గత రాత్రే కొందరు దీన్ని అతికించారు.’ అని కాంగ్రెస్ నేత జగదీష్ శర్మ మండిపడ్డారు.

    Nameplate of Priyanka Gandhi Vadra being put up outside the room allotted to her at Congress Headquarters, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళవారం కొత్త శోభ సంతరించకుంది. పార్టీ ఆఫీసులో ఓ గదిని సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారు. అందంగా అలంకరించి...ముందు పూలకుండీలు ఉంచారు. ఇదంతా ఎందుకో తెలుసా? కాంగ్రెస్ యువరాణి కోసం..! ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ త్వరలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్‌లో ఆమెకు ప్రత్యేక గదిని కేటాయించారు. సోదరుడు రాహుల్ గాంధీ కార్యాలయం పక్కనే ఆమె ఆఫీసును ఏర్పాటుచేశారు. మంగళవారం గది బయట గోడకు ప్రియాంక గాంధీ నేమ్ ప్లేట్ కూడా తగిలించారు.
    ప్రియాంక నేమ్ ప్లేట్ బిగిస్తున్న సిబ్బంది


    ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క ప్రియాంకాగాంధీ రాజకీయ ఆరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం రోజే ఆమె కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ ఆఫీసు పక్కనే ప్రియాంకాగాంధీ కోసం ప్రత్యేకంగా ఆఫీసు రూమ్ కేటాయించారు.

    ఇవి కూడా చదవండి

    రోడ్డు రోలర్‌పై వచ్చిన పెళ్లికొడుకు

    First published:

    అగ్ర కథనాలు