Saving Schemes : అందరూ సంపాదించిన మొత్తంలో కొంతైనా పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో అనేక ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వేటిలో పెట్టుబడి పెట్టాలో తెలియక కొందరు గందరగోళంలో ఉంటారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో చాలా మంది సురక్షితమైన పథకాల వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే మెరుగైన వడ్డీ, కచ్చితమైన రాబడి కారణంగా పోస్టాఫీస్ స్కీమ్‌లు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇండియన్ పోస్టాఫీస్ వివిధ కాలపరిమితితో అనేక సేవింగ్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. పైగా ఈ పథకాల వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరిస్తుంటారు. ఇప్పుడు ఈ స్కీమ్స్ వివరాలను పరిశీలిద్దాం.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్
ఈ స్కీమ్ 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో అందుబాటులో ఉంది. ప్రస్తుతం సంవత్సరానికి 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అయితే మెచ్యూరిటీ సమయంలోనే మొత్తం చెల్లిస్తారు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు రూ.100, రూ.500, రూ.1,000, రూ.5,000, రూ.10,000 డినామినేషన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. బ్యాంకు రుణాలను పొందేందుకు ఎన్‌ఎస్‌పీ సర్టిఫికెట్‌లను సెక్యూరిటీగా కూడా తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
ఇది సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన స్కీమ్. మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు. గరిష్టంగా రూ.15 లక్షలకు మించకుండా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.1000 మల్టిపుల్స్‌లోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. అంతేకాకుండా 55- 60 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి, సూపర్‌యాన్యుయేషన్‌పై లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద పదవీ విరమణ చేసిన వ్యక్తి కూడా రిటైర్‌మెంట్ ప్రయోజనాలను స్వీకరించిన ఒక నెలలోపు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి, ఆడపిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించకూడదని కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌పై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.6 శాతం. ఈ స్కీమ్ కింద కేవలం ఆడపిల్ల పేరు మీద మాత్రమే అకౌంట్ ఓపెన్ చేస్తారు. పుట్టిన తర్వాత పదేళ్ల వయసు వచ్చేలోపు ఈ అకౌంట్ తెరవవచ్చు.
Top 10 highest paid: ప్రపంచంలోనే అత్యధికంగా కాసుల వర్షం కురిపించే జాబ్ ఇదే..!
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్
నెలవారీ పెట్టుబడి పథకం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో రూ.1,500 మల్టిపుల్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఒక అకౌంట్‌కు గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 4.5 లక్షలు. అదే ఉమ్మడి ఖాతాలో రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏదైనా పోస్టాఫీసులో ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు.
15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్
పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్ స్కీమ్‌ల్లో ఇది ఒకటి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై పోస్టాఫీస్ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ డిపాజిట్‌లను ఒకేసారి లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. అయితే మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందు మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ 80c ప్రకారం.. ఈ పథకం డిపాజిట్స్‌కు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India post, Postal savings