• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PORTION OF SATTARGHAT BRIDGE ON GANDAK RIVER THAT WAS INAUGURATED BY CM NITISH KUMAR LAST MONTH COLLAPSED SK

సీఎం ప్రారంభించిన 29 రోజులకే కొట్టుకుపోయిన బ్రిడ్జి.. రూ.263 కోట్లు గంగపాలు

సీఎం ప్రారంభించిన 29 రోజులకే కొట్టుకుపోయిన బ్రిడ్జి.. రూ.263 కోట్లు గంగపాలు

కుప్పకూలిన బ్రిడ్జి

2012, ఏప్రిల్ 5 సత్తార్‌ఘాట్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం నితీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. 8 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తవడంతో ఇటీవలే బ్రిడ్జిని ప్రారంభించగా..అది 29 రోజుల్లోనే కొట్టుకుపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    సీఎం ప్రారంభించిన 29 రోజులకే బ్రిడ్జి కుప్పకూలింది. 8 ఏళ్లు కష్టపడిన కట్టిన ఆ బ్రిడ్జి..ప్రారంభించిన నెల రోజుల్లోనే కొట్టుకుపోయింది. బీహార్‌లోని గోపాల్ గంజ్‌లో ఈ ఘటన జరిగింది. గండక్ నదిపై నిర్మించిన సత్తార్‌ఘాట్ బ్రిడ్జిలో కొంత భాగం బుధవారం కొట్టుకుపోయింది. గండక్ నది ప్రవాహం పెరగడంతో ఆ ఉద్ధృతిని తట్టుకోలేక కూలిపోయింది. 1,440 మీటర్ల పొడవైన సత్తార్‌ఘట్ బ్రిడ్జిని జూన్‌ 16న సీఎం నితీష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నెల క్రితం ప్రారంభించిన ఆ వంతెన బుధవారం కూలిపోయింది. దాంతో గోపాల్ గంజ్‌లో రాకపోకలు స్తంభించిపోయాయి.

    బ్రిడ్జి కొట్టుకుపోయిన ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇంత నాసిరకంగా వంతెన నిర్మిచారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చని విమర్శలు గుప్పిస్తున్నారు. వందల కోట్లను గంగపాలు చేశారని విరుచుకుపడుతున్నారు. '' 269 కోట్లు ఖర్చుచేసిన 8 ఏళ్ల పాటు నిర్మించిన బ్రిడ్జి 29 రోజుల్లోనే కొట్టుకుపోయింది. నితీష్ హయాంలో ఇలాంటివి మామూలే. ఈ డబ్బులు వారి ఎలుకలు తాగే ఆల్కాహాల్ విలువ కాదు.'' ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ యాదవ్ ఎద్దేవా చేశారు.

    గోపాల్ గంజ్, ఈస్ట్ చంపారన్‌ను కలిపే ప్రధాన లింక్ ఇదే. ఇప్పుడు బ్రిడ్జి తెగిపోవడంతో ఆ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. గండక్ నది ఉద్ధృతి పెరగడంతో పాటు వాల్మికి నగర్ నుంచి నీరు విడుదల చేయడంతోనే బ్రిడ్జి కొట్టుకుపోయిందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా, 2012, ఏప్రిల్ 5 సత్తార్‌ఘాట్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం నితీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. 8 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తవడంతో ఇటీవలే బ్రిడ్జిని ప్రారంభించగా..అది 29 రోజుల్లోనే కొట్టుకుపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published: