హోమ్ /వార్తలు /national /

Medak : టీఆర్ఎస్‌కు జడ్పిటిసి రాజీనామా..! ఉమ్మడి మెదక్‌లో మరో షాక్...!

Medak : టీఆర్ఎస్‌కు జడ్పిటిసి రాజీనామా..! ఉమ్మడి మెదక్‌లో మరో షాక్...!

Khammam

Khammam

Medak : తెలంగాణలో ఇన్నాళ్లు ఏకచత్రాధిపత్యంతో ముందుకు సాగిన టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.రెండు రోజుల క్రితమే దుబ్బాక కౌన్సిలర్లు పార్టీ మారగా..వారిని తిరిగి పార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే తాజాగా అదే జిల్లాలోని ఓ జడ్పిటీసీ సైతం రాజీనామా చేశారు.

ఇంకా చదవండి ...

  News 18 ప్రతినిధి

  కె.వీరన్న

  మెదక్ జిల్లా

  తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీలు రెండు తమ బలాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన అసంతృప్త నేతలకు ఇతర పార్టీల్లోకి అవకాశం కల్పిస్తుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌ను వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్స్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు..అయితే వారి చేరికను సవాలుగా తీసుకున్న మంత్రి హరీష్ రావు 24 గంటలు గడవక ముందే వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చారు.

  కాగా తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది.. .నర్సాపూర్ నియోజకవర్గంలో చిల్పిచెడ్ మండలం జడ్పీటీసీ శేష సాయిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతోపాటు జడ్పిటిసి పదవికి రాజీనామా చేశాడు. కాగా శేషసాయి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంత అన్న కొడుకు కావడం విశేషం. అయితే తమను నియోజకర్గంలో కనీసం ప్రొటోకాల్ పాటించకపోవడంతోపాటు పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారిన ఆయన ఆరోపణలు చేశారు.దీంతో మనస్థాపం చెందిన సాయిరెడ్డి జడ్పీటీసితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.ఇక ఈ వ్యవహారమంతా జిల్లా మంత్రి హరీష్ రావు దృష్టికి స్థానిక నేతలు తీసుకువెళ్లడంతో ఆయన సుమారు రెండు గంటలపాటు జెడ్పిటిసితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయినా సమస్య కొలిక్కి రాకలేదని సమాచారం.


  మరోవైపు నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట..కాని సునితా లక్ష్మారెడ్డి ఓడిపోవడం..మదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడతో ఆ నియోజకవర్గం గులాబీ మయంగా మారింది. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి సైతం టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిందనే ప్రచారం కొనసాగుతోంది.

  కాగా ఇటివల టీపీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టడంతోపాటు తన స్ట్రాటజీని అమలు పరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో తన క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ముఖ్యంగా పార్టీ మారిన నేతలను టార్గెట్ చేసిన ఆయన కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. దీంతో టీఆర్ఎస్‌లోకి చేరిన పార్టీ నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రాజీనామా చేసిన శేషసాయి రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం కొనసాగుతోంది.గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది..కాని మారుతున్న రాజీకీయ పరిణామాలు ఆ పార్టీకి కోలుకోకుండా చేశాయి. దీంతో రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపడంతో తిరిగి అధికారం చేజిక్కుంచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Medak Dist, Trs

  ఉత్తమ కథలు