హోమ్ /వార్తలు /national /

వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై జనసేన కార్యకర్తల దాడి

వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై జనసేన కార్యకర్తల దాడి

 కాళీపట్నంలో జనసేన ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో రఘురామకృష్ణం రాజు వాహనాలు కూడా ఆ మార్గంలో వచ్చాయి. దీంతో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు.

  వైసీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణం రాజు కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో జరిగింది. కాళీపట్నంలో జనసేన ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో రఘురామకృష్ణం రాజు వాహనాలు కూడా ఆ మార్గంలో వచ్చాయి. దీంతో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. రఘురామకృష్ణం రాజు వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో రఘురామకృష్ణం రాజు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే నిరసనకారులను చెదరగొట్టి వైసీపీ ఎంపీ అభ్యర్థిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రఘురామకృష్ణం రాజు వాహనంపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాళీపట్నం చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు.

  raghurama krishnamraju
  వైసీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజు

  నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తున్నారు. జనసేన తరఫున నాగబాబు బరిలో ఉన్నారు. దీంతో పాటు ఇటీవల కాపుల మీద రఘురామకృష్ణం రాజు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ‘కాపులకు రాజకీయాలు ఎందుకు?’ అంటూ రఘురామకృష్ణం రాజు వెటకారం చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు వాహనంపై దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena party, Lok Sabha Election 2019, Narsapuram S01p09, Ysrcp

  ఉత్తమ కథలు