హోమ్ /వార్తలు /national /

సంక్రాంతి సృష్టికర్త చంద్రబాబు కొత్త డ్రామాలు.. విజయసాయిరెడ్డి విమర్శలు

సంక్రాంతి సృష్టికర్త చంద్రబాబు కొత్త డ్రామాలు.. విజయసాయిరెడ్డి విమర్శలు

విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి పిటిషన్

విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయి రెడ్డి పిటిషన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయం ఇంకా తెలియడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయం ఇంకా తెలియడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయారో తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి. పైగా సారీ-పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నారు.’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. అలాగే, రైతుల కోసం తెచ్చిన జీవోను చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు బోగిమంటల్లో వేయడాన్ని విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. ‘అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి.. చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు.  ‘నిమ్మగడ్డతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పించి ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మఒడి సాయాన్ని ఆపాలనుకోవడం... ఆరోజుల్లో కళ్లెర్రజేసి సముద్రాన్ని కంట్రోల్ చేశా, తుఫానును అడ్డుకున్నానని కోతలు కోయడం లాంటివే బాబు. ఏదో చేయాలనుకుంటావు కానీ ఏమీ జరగదు. భ్రాంతి నుంచి బయటపడు..‘ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతకుముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘సీఎస్ వద్దన్నా - ఉద్యోగ సంఘాలు నో అన్నా. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్దం అయినా- ఎవరి ప్రయోజనాలకోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డా?, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే... నువ్వు చేసే నిర్వాకం ఇదా? ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావె!‘ అంటూ ట్వీట్ చేశారు.

ఇక జగన్ దయవల్ల రాష్ట్రంలో క్షీరవిప్లవం వచ్చిందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ‘ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షీర విప్లవానికి స్వాగతం చెప్పడంతో మన జాతి మొత్తానికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఆయన విప్లవాత్మక నిర్ణయం కొన్ని వేల మంది పాడి రైతులను పేదరికంపై విజయం సాధించేలా చేసి శ్రమకు తగ్గ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది.’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

First published:

Tags: Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు