హోమ్ /వార్తలు /national /

రవి ప్రకాష్‌పై సీబీఐ, ఈడీ విచారణ.. సీజేఐకు విజయసాయిరెడ్డి లేఖ

రవి ప్రకాష్‌పై సీబీఐ, ఈడీ విచారణ.. సీజేఐకు విజయసాయిరెడ్డి లేఖ

హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాలో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్ లో పెట్టుబడులు పెట్టారని సాయి రెడ్డి ఆరోపించారు.

  Tv9 బహిష్కృత సీఈఓ రవిప్రకాష్ ఆస్తులపై ఈడీ విచారణ, రవిప్రకాష్ స్కాం లపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రవిప్రకాష్... ఫెమా, ఆర్బీఐ, మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆదాయపన్ను ఎగ్గొట్టడం ద్వారా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ లేఖలో సీజేఐకి ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్‌ ఖురేషి, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ తో కలసి‌ చాలా మందిని‌ రవిప్రకాష్ మోసం చేసారని విజయసాయిరెడ్డి లేఖలో‌పేర్కొన్నారు.

  సానా సతీష్, మొయిన్ ఖురేషి, రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్ లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. హవాలా సొమ్మును కెన్యా, ఉగాండాలో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్ లో పెట్టుబడులు పెట్టారని సాయి రెడ్డి ఆరోపించారు. రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితాను, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖ లో తెలిపారు.

  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు విజయసాయిరెడ్డి రాసిన లేఖ

  బంధువులు కాబోతున్న సానియా మీర్జా, అజారుద్దీన్

  First published:

  Tags: Ravi prakash, Supreme Court, Vijayasai reddy

  ఉత్తమ కథలు