అనేక అంశాల్లో టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసే వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి... కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అడ్డమైన విషయాలపై జూమ్‌లో మాట్లాడే చంద్రబాబుకు... ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా ? అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అసలు మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు గారూ..
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 13, 2020
శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి..?
అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?
మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? pic.twitter.com/iPH8ECUp1D
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Pothireddypadu, Tdp, Vijayasai reddy, Ysrcp