విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్న వేళ.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విశాఖకు రాజధాని రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ డేంజర్ సిటీ అని ప్రచారం చేస్తూ.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో మాట్లాడిన విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, టీడీపీ కుట్రలను ఉత్తరాంధ ప్రజలు సమిష్టిగా ఎదుర్కొవాలని సూచించారు.
విశాఖపై చంద్రబాబు రకరకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. కోర్టులో కేసులు వేస్తారు. విశాఖ డేంజర్ సిటీ..ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. వారి కుట్రలను విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలంతా సమిష్టిగా ఎదుర్కొనప్పుడే విశాఖ రాజధానిని సాధించుకోగలుగుతాం. విశాఖ అభిృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు.
కాగా, ఏపీలో మూడు రాజధానుల తీసుకురావాలని ఇప్పటి వైఎస జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, అమరావతిని శాసన వ్యవహారాలు, కర్నూలును జ్యుడీషియరీ క్యాపిటల్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులనుఏపీ అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించింది. ఆ తర్వాత మండలిలో రెండు బిల్లులు ఆగిపోవడంతో.. గత నెలలో జరిగిన ఏపీ బడ్జెట్ సమావేశాల్లోనూ బిల్లులను మళ్లీ ఆమోదించారు. ఆతర్వాత మరోసారి మండలికి పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సభలో గందరగోళం చెలరేగడంతో ఏ బిల్లునూ ఆమోదించకుండానే.. శాసన మండలి నిరవధికంగా వాయిదాపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap capital, AP News, Chandrababu naidu, Vijayasai reddy, Visakhapatnam