అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి నుంచి రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుందని చంద్రబాబు అతిగా ఊహించుకున్నారని ఎద్దేవా చేశారు. తన పిలుపును ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ను వీధుల్లోకి వదిరారని, వీరంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని మండిపడ్డారు. పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమేనంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయి ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగు చూస్తుంటే కులం, కక్ష అంటూ ఆయన అనుకూల మీడియా బట్టలు చించుకుంటోందని విమర్శించారు.
అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నాడు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలాడు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2020
పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2020
అమరావతితో సంబంధంలేని మహిళలతో దాడులు చేయించడమా? 40 ఏళ్ల అనుభవం అంటే అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం నుంచి దించినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్రపన్నడం తప్ప..రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికే చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరో ఏడాదిలో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయని అన్నారు. సీఎం జగన్ పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుందని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Vijayasai reddy, Ysrcp