టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కరోనా వీరులు కరకట్ట మీద వాలారట! ఇక కృష్ణా నదికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో! అంటూ ట్వీట్ చేశారు. సలహాలు, సూచనలు అంటూ జూమ్‌లో రోజూ ఊదరగొట్టావు కదా అని వ్యాఖ్యానించారు. ఏడాది పాలన పై వైఎస్ జగన్ స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూశారని... కానీ మీరు అలా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ? అంటూ ఎద్దేవా చేశారు.
కరోనా వీరులు కరకట్ట మీద వాలారట!
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 26, 2020
ఇక కృష్ణా నదికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో!
ఇక రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సోమవారం ఏపీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 20న చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో చంద్రబాబు తన కుటుంబంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Vijayasai reddy, Ysrcp