హోమ్ /వార్తలు /national /

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ సెటైర్

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ సెటైర్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

    ఏపీలో వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. ఒకే ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్‌ని, 23 సీట్లు గెలిచిన చంద్రబాబు క్రేన్ పెట్టి పైకెత్తుతున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కానీ... జగన్ ఎవరికీ అందనంత ఎత్తులో వున్నారని అన్నారు. జగన్‌పై పిడకలు వేయించే ప్రయత్నం చేస్తే అవి మీ మీదే పడతాయి అంటూ విమర్శించారు. విశాఖ లాంగ్, ఆ తరువాత జరిగిన సమీక్షల్లో ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్... ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసే సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

    First published:

    Tags: AP News, Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు