టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్తు ఛార్జిల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీదంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 20 సంవత్సరాలైనా ఆ సంఘటనను ఎవరూ మర్చిపోలేదని ఆయన తెలిపారు.
చంద్రబాబు ఎల్జీ ప్లాంట్‌కు అనుమతులపై చర్చకు వస్తారా అని సవాల్ విసరడంపై విజయసాయిరెడ్డి స్పందించారు. మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా ? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా ? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విస్తరణకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే అని వైసీపీ విమర్శలు గుప్పించింది. దీనిపై నిన్న స్పందించిన చంద్రబాబు... ఆ కంపెనీకి ఎవరు అనుమతులు ఇచ్చారనే దానిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి... తాజాగా ఆయనకు సవాల్ విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp