హోమ్ /వార్తలు /national /

కన్నా విషయంలో వెనక్కి తగ్గని విజయసాయిరెడ్డి...

కన్నా విషయంలో వెనక్కి తగ్గని విజయసాయిరెడ్డి...

విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ

విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ

చంద్రబాబుకు చీమ కుడితే బిజెపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఏపీ బీజేపీ కన్నా లక్ష్మీనారాయణతో మాటల యుద్ధం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించడం... ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి కన్నా లక్ష్మీనారాయణ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. సాష్టాంగ ప్రమాణం చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాజాగా కాణిపాకం ఎప్పుడొస్తున్నావంటూ కన్నా లక్ష్మీనారాయణను ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు... కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి అదే రకమైన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి.

కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయని అన్నారు. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయని ఆరోపించారు. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు అని పేర్కొన్నారు. చంద్రబాబుకు చీమ కుడితే బిజెపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆరోపించారు. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయని అన్నారు. ఎప్పుడు ఏవిధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుందని విమర్శించారు. మొత్తానికి విజయసాయిరెడ్డి తీరు చూస్తుంటే... కన్నా, విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధానికి ఇప్పుడప్పుడే ముగింపు ఉండేలా కనిపించడం లేదు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, Kanna Lakshmi Narayana, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు