హోమ్ /వార్తలు /national /

విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం...

విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం...

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)

కాపుల ఆత్మీయ సమావేశానికి విజయసాయిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలు హాజరుకావడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాపుల సమావేశానికి విజయసాయిరెడ్డి హాజరుకావడంపై కొందరు కాపులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కంబాలకొండలో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, జనసేనకు చెందిన కాపు నేతలు హాజరైన ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖలోనే ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొందరు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే, కాపులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ సమావేశానికి వైసీపీ నేతలు అందరినీ తీసుకురావడం ఏంటని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. అయితే, వారికి సర్దిచెప్పేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. ‘నేను కూడా కాపునే. నా పదో తరగతి సర్టిఫికెట్ చూస్తే అందులో కాపు అనే ఉంటుంది. మీలో నన్ను ఒకడిగా చూడండి. కాపుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కొందరు చప్పట్లు కొట్టారు. అయితే, మరికొందరు మాత్రం ‘జై కాపు... జైజై కాపు’ అంటూ నినాదాలు చేశారు.

  విజయసాయిరెడ్డి సమక్షంలో కొందరు ఆందోళన చేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ అక్కడకు వచ్చిన కాపులపై సీరియస్ అయ్యారు. విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తనకు మాత్రమే మంత్రి పదవి వచ్చిందని, అంటే ఏ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తాను ఇక్కడకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నాను కాబట్టి సహనంగా ఉంటున్నానని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Kapu Reservation, Vijayasai reddy, Visakhapatnam, Ysrcp

  ఉత్తమ కథలు