జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టయిల్లో వేశారు. కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్ అంటూ కామెంట్ చేశారు. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా ? అని పవన్ కళ్యాణ్‌ను విమర్శించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్వాసనపై స్పందించిన పవన్ కళ్యాణ్... ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా, ఎన్నికల సంఘం కమిషనర్‌ను తప్పించడాన్ని తప్పుపట్టారు.
కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 11, 2020
జగన్ ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏకపక్ష నిర్ణయం తీసుకుందని... రమేష్ కుమార్‌ను తొలగించడం ద్వారా తమ వైఖరి ఏ మాత్రం మారలేదని మరోసారి రుజువు చేసిందని ఆరోపించారు. ముఖ్యమైన విషయాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయిని... వీటన్నిటిలోనూ హైకోర్టులో చీవాట్లు పెట్టించుకున్నా ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వ వ్యవహారం అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి...పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.