హోమ్ /వార్తలు /national /

చంద్రబాబు తీరు అలా... విజయసాయిరెడ్డి సెటైర్

చంద్రబాబు తీరు అలా... విజయసాయిరెడ్డి సెటైర్

విజయసాయిరెడ్డి, చంద్రబాబు

విజయసాయిరెడ్డి, చంద్రబాబు

23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే... చంద్రబాబు తన పరిపాలనను తానే మెచ్చుకోవడం వింతగా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే... చంద్రబాబు తన పరిపాలనను తానే మెచ్చుకోవడం వింతగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన తీరు చూస్తుంటే... కోతి మొహం కోతికి ముద్దు అనే సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు జిఓపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి బాబు అను-కుల మీడియా కింద మీదా పడుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా లేని రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు.


రాజకీయ పార్టీల కంటే ఎల్లో మీడియా ఎజెండానే అత్యంత క్రూరంగా, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవాలన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియాను సృష్టించి నదులను అడుగంటా ఊడ్చినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ విధించింది చంద్రబాబు హయాంలోనే కదా ? అని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రకాశం బ్యారేజిలో 15 ఎకరాల కృత్రిమ ద్వీపం ఏర్పాటుకు డ్రెడ్జింగుకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే అని విమర్శించారు. ఇప్పుడు మడ అడవుల పేరుతో పర్యావరణం ఖూనీ అని దొంగ ఏడుపులేడుస్తున్నారని మండిపడ్డారు.

First published:

Tags: Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు