హోమ్ /వార్తలు /national /

చంద్రబాబుకు అందుకు రెడీనా... వైసీపీ ఎంపీ ఛాలెంజ్

చంద్రబాబుకు అందుకు రెడీనా... వైసీపీ ఎంపీ ఛాలెంజ్

సీఎం జగన్‌కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువని చంద్రబాబు ధ్వజమెత్తారు..మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటడం లేదని అన్నారు. నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదని అన్నారు. ఫిరాయింపులపై గతంలో అసెంబ్లీలో ఏం చెప్పారని.. ఇప్పుడేం చేస్తున్నారు అనేదానిపై ప్రజలే చర్చిస్తున్నారని అన్నారు.

శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలని.... కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో ఆయనకు దిక్కుతోచడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు.

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై చందాలు దందాలు అంటూ ఆరోపణలు చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి... మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్ధామా అని సవాల్ విసిరారు. ఇందుకోసం పిటీషన్లు వేద్దామని... కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దామన్న విజయసాయిరెడ్డి... ఇందుకు చంద్రబాబు రెడీనా ? అని ఛాలెంజ్ చేశారు. శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలని.... కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో ఆయనకు దిక్కుతోచడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. వాటిని దాస్తున్నారని బురద కుమ్మరించడానికీ సిగ్గుపడడని తీవ్రస్థాయిలో విమర్శించారు.

2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రానే అని... ఇలాంటి చంద్రబాబుకు కనిపించవని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాదని... కొంత కాలం దాంతో కలిసుండాల్సిందే అన్నందుకు సిఎం జగన్‌ చేతులెత్తేశారని చంద్రబాబు ఎద్దేవా చేయడాన్ని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ఎల్లో మీడియా ‘జయము జయము చంద్రన్న’ భజన అందుకుందని.. ప్రపంచమంతా అంటున్నదే సీఎం జగన్ చెప్పారని విజయసాయిరెడ్డి అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు