ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శిఖండిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే యుద్ధం ఎల్లో మీడియాను ఉత్సాహపరుస్తుందని... కానీ పరాజయాన్ని మాత్రం నిలువరించలేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమని అన్నారు. ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫోటోకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. నువ్వెన్ని కుట్రలు పన్నినా ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయం. శిఖండిని అడ్డం పెట్టుకుని నువ్వు చేసే యుద్ధం ఎల్లో మీడియాను ఉత్సాహపరుస్తుంది. కానీ పరాజయాన్ని మాత్రం నిలువరించలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 19, 2020
నిజంగా కరోనా భయానికే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్మెంట్లు మరోలా ఉండేవని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వాయిదాతో పరాజయ భారాన్ని కొద్ది రోజులు తప్పించుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఊరట కలిగించాయిని విజయసాయిరెడ్డి అన్నారు. పంపిణీ చేసే స్థలాల్లో గృహ నిర్మాణం కోసం సిమెంట్ ధరలను భారీగా తగ్గించేలా కంపెనీలను ఒప్పించడం సీఎం జగన్ గొప్ప విజయమని కొనియాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp