హోమ్ /వార్తలు /national /

విశాఖలో ఆ ఒక్కటే నా ఆస్తి... వైసీపీ ఎంపీ వివరణ

విశాఖలో ఆ ఒక్కటే నా ఆస్తి... వైసీపీ ఎంపీ వివరణ

విజయసాయిరెడ్డి (File)

విజయసాయిరెడ్డి (File)

విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నట్టు తనపై వస్తున్న ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

  తన పేరు చెప్పుకుని కొందరు భూ సమస్యల పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంపై వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఏ అధికారికి ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఎప్పుడూ ఫోన్ చేయలేదని ఆయన అన్నారు. తన పేరు చెప్పుకుని ఎవరైనా అధికారుల దగ్గరకు వస్తే... వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇదే విషయాన్ని తాను కలెక్టర్, నగర కమిషనర్‌కు చెప్పానని అన్నారు. తనకు విశాఖలో ఓ ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మినహా మరే ఇతర ఆస్తులు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో ఇలాంటి భూదందాలకు వ్యతిరేకంగా గతంలో తానే పోరాటం చేశానని ఆయన తెలిపారు. ఈ నెల 28న విశాఖకు రాబోతున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆ రోజున 24 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పాటు చేసి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

  విశాఖలో వైసీపీ నేతలు భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించుకుని... విజయసాయిరెడ్డి ద్వారా జగన్, వైసీపీ నేతలు భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలు విశాఖలో వందల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి... విశాఖలో ఎవరైనా తన పేరు చెప్పుకుని భూదందాలకు పాల్పడితే అరెస్ట్ చేయాలని అన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Vijayasai reddy, Visakhapatnam, Ysrcp

  ఉత్తమ కథలు