హోమ్ /వార్తలు /national /

అలా జరిగితే... సమావేశాలకు వెళ్లను... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అలా జరిగితే... సమావేశాలకు వెళ్లను... వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి బాయ్ కాట్ చేయడంపై రఘురామకృష్ణంరాజు స్పందించారు.

  నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోతే... ఇకపై వారు నిర్వహించే సమావేశాలకు వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి బాయ్ కాట్ చేయడంపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఎంపీగా తాను డయాస్‌ మీద లేకుండా అధికారులు ఉండటంతో కలత చెందానని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారుల కంటే తామే ఎక్కువని ఆయన స్పష్టం చేశారు.

  దిశ కమిటీకి, లోక్‌సభలో సబ్‌ ఆర్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్న తనకు జిల్లా అభివృద్ధి మండలిలో కూడా సముచిత స్థానం ఉంటుందని భావించానని... తనకు జరిగిన ఈ అవమానం తనకు ఓట్లు వేసిన ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. అధికారులు తమ కంటే ఎక్కవని నిబంధనలు చెబితే.. తాను అలాంటి మీటింగ్‌లకు ఇకమీదట వెళ్లబోనని స్పష్టం చేశారు. ఈ విషయమై జిల్లా మంత్రి ఆళ్ల నాని స్పందిస్తారని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇలాగే జరిగితే... ఇక ముందు జరిగే మీటింగ్‌లకు వెళ్లబోమని ఆయన వ్యాఖ్యానించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు