హోమ్ /వార్తలు /national /

నోరు జారిన వైసీపీ ఎంపీ... సోషల్ మీడియాలో వైరల్

నోరు జారిన వైసీపీ ఎంపీ... సోషల్ మీడియాలో వైరల్

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

MP Raghuramakrishnamraju: చాలా విషయాల్లో సొంత పార్టీతో విభేదించినట్టు కనిపించే రఘురామకృష్ణంరాజు చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  వైసీపీలో అందరి దారి ఒకలా ఉంటే... నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దారి మాత్రం వారికి భిన్నంగా ఉంటుంది. చాలా విషయాల్లో సొంత పార్టీతో విభేదించినట్టు కనిపించే రఘురామకృష్ణంరాజు చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆశ్చర్యపోవడం సొంత పార్టీ వైసీపీ కార్యకర్తల వంతైంది. పార్టీలోనూ దీనిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో స్థానికంగా విభేదాలు తలెత్తాయి. వైసీపీలోని రెండు వర్గాలు తమ నేతకు ఛైర్మన్ సీటు ఇవ్వాలని కోరడంతో అంతర్గతంగా ముసలం మొదలైంది. దీనిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు.

  అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన హామీ ఇస్తుండగానే కొందరు పార్టీ కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేశారు. దీంతో రఘురామకృష్ణంరాజుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. ఎవడి నాయకత్వం కావాలి.. బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కూర్చోవాలంటూ కార్యకర్తలపై మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ ప్రత్యర్థులు కూడా ఈ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు