హోమ్ /వార్తలు /national /

బోషిడికే అంటే తిట్టు కాదు -దాని అర్థమిదే -Chandrababuను చంపమని Jaganఅన్నాడుగా: mp raghurama

బోషిడికే అంటే తిట్టు కాదు -దాని అర్థమిదే -Chandrababuను చంపమని Jaganఅన్నాడుగా: mp raghurama

ఎంపీ రఘురామ

ఎంపీ రఘురామ

బోషిడికే అనే పదంపై ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు భగ్గుమన్నాయి. సీఎం జగన్ ను ఉద్దేశించి ఆ పదం వాడినందుకుగానూ టీడీపీ ఆఫీసులు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై అధికార, విపక్షాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం అసలు బోషిడికే అనేది బూతు పదమేకాదని, దానికి అసలైన అర్థం ఇదంటూ జగన్ సర్కారుపై సీరియస్ సెటైర్లు వేశారు..

ఇంకా చదవండి ...

ప్రతిపక్ష టీడీపీ నేతలు, ఆఫీసులపై అధికార వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులను నిరసిస్తూ టీడీపీ బుధవారం నాడు ఏపీ బంద్ కు పిలుపునివ్వగా, వైసీపీ మంత్రులు, నేతలు విపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారు. టీడీపీ కుట్రపూరితంగా ఉద్రిక్తతలు సృష్టిస్తోందని సీఎం జగన్ మండిపడగా, ఏపీలో దిగజారిన పరిస్థితులపై జోక్యం కోరుతూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వివాదానికి అసలు కారణమైన బోషిడికే పదానికి అర్థం చెప్పారిలా.. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

బోషిడికే అంటే బూతు కాదు..

‘టీడీపీ నేత పట్టాభి.. సీఎం జగన్ ను బోషిడికే అనబట్టే వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని తెలిసింది. అయితే, ఇంత వివాదానికి కారణమైన ఆ పదానికి అర్థమేంటో తెలుసుకునేందుకు నేను చాలా ప్రయత్నించాను. నా ఫ్రెండ్స్ ఓ పాతిక మందిని వాకబు చేశాను. వైసీపీలోని అజ్ఞాత మిత్రులను కూడా అడిగాను. వాళ్లంతా ఆ పదానికి అర్థం తేలీదుగానీ, కచ్చితంగా బూతు పదమే అన్నారు. చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే బోషిడికే అంటే బూతు పదం కాదు..

ఆ పదానికి అర్థం ఇదే..

నేను గూగుల్‌లో సెర్చ్ చేయగా బోషిడికే అనే పదానికి చాలా స్పష్టమైన అర్థం దొరికింది ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’అనేది సంస్కృతంలో బోసడీకే దానికి అర్థం’ అని రఘురామ పేర్కొన్నారు. నిజానికి బూతులు మాట్లాడటమే తప్పయితే, ఎదుటి వాళ్లపై దాడి చేయడానికి దాన్నే కారణంగా చూపాలనుంకుటే, వైసీపీ మంత్రుల పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే..

చంద్రబాబును చంపమన్నారుగా..

టీడీపీ నేతలు బూతులు తిట్టినందుకు హర్ట్ అయ్యారు కాబట్టే వైసీపీ అభిమానులు టీడీపీ ఆఫీసులపైకెళ్లారని సీఎం జగన్ వివరణ ఇచ్చారు. మరి ఇదే వైసీపీ నేతలు నన్ను పచ్చిబూతులు తిట్టారు. నన్ను బండ బూతులు తిట్టినవాళ్లకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారట. గతంలో ఇదే జగన్.. చంద్రబాబును ఉద్దేశించి ‘ఈ ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి’అనలేదా? మరి అది బూతువాక్యం కాదా? ఆనాడు టీడీపీ అభిమానులకు కోపం రాకపోవడం, వైసీపీపై దాడులు చేయకపోవడం తప్పయిపోయిందా? ఇంత పెద్ద స్థాయలో హింస జరిగితే ఒక్కరినీ అరెస్టు చేయకపోవడమేంటి?’’అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు.

First published:

Tags: Attack, Chandrababu Naidu, MP raghurama krishnam raju, Raghuramakrishnam raju, TDP, Ys jagan, Ysrcp

ఉత్తమ కథలు