హోమ్ /వార్తలు /national /

వాళ్లెవరు నీతులు చెప్పడానికి... డోంట్ కేర్ అంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు

వాళ్లెవరు నీతులు చెప్పడానికి... డోంట్ కేర్ అంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు

రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ లోక్‌సభ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ ఇచ్చిన పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం ఈ మేరకు స్పందించింది. నిజానికి వైసీపీ ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్‌ కమిటీకి పంపగా, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. ప్రవిలేజ్ కమిటీ విచారణ ఇంకా ముగియకముందే, అనర్హత వేటు వేయలేమంటూ స్పీకర్ కార్యాలయం పేర్కొనడం గమనార్హం. రఘురామ వివరణనను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు తనకు చెక్ పెట్టేందుకే గోకరాజు గంగరాజు కుమారుడిని, సోదరులను జగన్ వైసీపీలోకి తీసుకొచ్చారన్న వాదనను రఘురామకృష్ణం రాజు ఖండించారు.

  వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి వార్తల్లో నిలిచారు. తాను వైసీపీలో ఒకే ఒక్కరి మాట వింటానని, అది కూడా సీఎం జగన్ చెబితేనే వింటానని స్పష్టం చేశారు. మరెవరు చెప్పినా విననని తేల్చి చెప్పారు. విజయసాయరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి కూడా అది వర్తిస్తుందని నరసాపురం ఎంపీ వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జగన్‌కు, తనకు మధ్య గొడవలు పెట్టేందుకు ముగ్గురు, నలుగురు ప్రయత్నాలు చేశారని చెప్పారు. అయితే, సీత మీద రాముడికి అనుమానం ఉండొచ్చు కానీ, తన మీద మాత్రం జగన్‌కు ఏమాత్రం అనుమానం లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరబోనని రఘురామకృష్ణంరాజు స్పష్టంచేశారు. అదే సమయంలో తన వ్యక్తిగతమైన సంబంధాలు అన్ని పార్టీల వారితోనే కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.

  ‘వైసీపీలో నాకు ఒకే ఒక్కరు లీడర్. జగన్ చెబితే ఓకే. ఇంకెవ్వరూ నాకు లీడర్లు లేరు. వాళ్లు చెప్పినా నేను వినను. ఒకరి చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నీతులు చెప్పగలిగింది జగన్ ఒక్కరే. సుబ్బారెడ్డి చెప్పారని నోరు మూసుకుంటే నాకు ఓటు ఆయనొచ్చి వేస్తారా? ప్రజల కోసం ఎవరినైనా కలుస్తా. నాకు ఎవరితోనూ గ్యాప్ లేదు. ఎవరినీ పట్టించుకోను.’ అని స్పష్టం చేశారు.

  ఇక విజయసాయిరెడ్డి మాట కూడా తాను వినేది లేదని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు. ‘అసలు నన్ను పార్టీలోకి తీసుకొచ్చింది సాయిరెడ్డే. ఆయన పని ఆయన చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటా. అసలు మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేదే లేదు. ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది.’ అని రఘురామకృష్ణంరాజు అన్నారు.

  మరోవైపు తనకు చెక్ పెట్టేందుకే గోకరాజు గంగరాజు కుమారుడిని, సోదరులను జగన్ వైసీపీలోకి తీసుకొచ్చారన్న వాదనను రఘురామకృష్ణం రాజు ఖండించారు. వాస్తవానికి నెల క్రితం తానే గంగరాజు సోదరులను వైసీపీలోకి ఆహ్వానించినట్టు చెప్పారు. వారు పార్టీలో చేరుతున్న విషయం ఆ ముందురోజు వరకు తనకు తెలియదన్నారు. 2024లోమళ్లీ జగన్ తనకు సీటు ఇస్తారని, తాను ఎంపీ అవుతానని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు