హోమ్ /వార్తలు /national /

దమ్ముంటే రాజీనామా చేసి గెలువు.. సొంత పార్టీ ఎంపీకి వైసీపీ నేతల సవాల్

దమ్ముంటే రాజీనామా చేసి గెలువు.. సొంత పార్టీ ఎంపీకి వైసీపీ నేతల సవాల్

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

స్వచ్ఛందంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి.. పార్టీ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన అంత పోటుగాడైతే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.

  వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కాకా రేపుతోంది. ఆయన తీరుపై వైసీపీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వ పథకాలను విమర్శించడంతో పాటు బతిమిలాడితేనే తాను వైసీపీ చేరానని ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరికి చెందిన వైసీపీ నేతలు మంత్రి రంగనాథ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, సత్యనారాయణ, కారుమూరి, ప్రసాదరాజు.. సీఎం జగన్‌ను కలిసి ఎంపీ తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఫొటో లేకుంటే రఘురామ కృష్ణంరాజు ఎంపీ గెలిచేవాడా? అన్ని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి.. పార్టీ నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన అంత పోటుగాడైతే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు వైసీపీ నేతలు.

  రఘురామ కృష్ణంరాజు పార్టీ మారాలనుకుంటే వెళ్లిపోవాలి. అంతేగానీ ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు.

  - మంత్రి రంగనాథ రాజు

  రఘురామ కృష్ణంరాజుకు బ్యానర్ కట్టే కేడర్ కూడా లేదు. జగన్ ఫొటో లేకుంటే నువ్వు ఎంపీ అయ్యే వాడివా?

  - ఎమ్మెల్యే సత్యానారాయణ

  ఒక్కసారి పోటీ చేయడానికి రఘురామ కృష్ణంరాజు మూడు సార్లు పార్టీ మారారు.

  - ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్

  రఘురామను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ ససేమిరా అన్నారు. కానీ మేమే బలవంతంగా ఒప్పించాం.

  - ఎమ్మెల్యే కారుమూరి

  పార్టీని వీడేందుకు రఘురామ కృష్ణంరాజు సన్నద్ధమవుతున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి.

  - ఎమ్మెల్యే ప్రసాదరాజు

  సోమవారం మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసలు తాను వైసీపీలో చేరాలని అనుకోలేదని.. ఆ పార్టీ నేతలు కాళ్లా వేళ్లా పడి బతిమిలాడడం వల్లే వైసీపీలో చేరానని చెప్పారు. జగన్ పలు మార్లు ఫోన్ చేసి వైసీపీలో చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని తెలిపారు. తాను కాకుండా నర్సాపురంలో ఇంకెవరు పోటీ చేసినా ఓడిపోయేవారని రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీతో పాటు కేడర్ నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, MP raghurama krishnam raju, Raghuramakrishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు