హోమ్ /వార్తలు /national /

లిక్కర్ ధరలు అందుకే పెరిగాయి.. ఎమ్మెల్యే రోజా క్లారిటీ

లిక్కర్ ధరలు అందుకే పెరిగాయి.. ఎమ్మెల్యే రోజా క్లారిటీ

జబర్దస్త్‌లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలా కంటిన్యూ అవుతుందనే బాధతో మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.

జబర్దస్త్‌లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలా కంటిన్యూ అవుతుందనే బాధతో మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.

మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను సీఎం జగన్ పెంచారని ఎమ్మెల్యే రోజా అన్నారు.

  దాదాపు 40 రోజుల తర్వాత ఏపీలో మద్యం దుకాణాలను తెరిచింది ప్రభుత్వం. ఐతే వైన్ షాప్‌లను తెరుస్తూనే ధరలను ఏకంగా 25శాతం పెంచారు. ఈ క్రమల మద్యం ధరల పెంపుపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కరోనా కాలంలో లిక్కర్ ధరలను పెంచడమంటే.. పేదల రక్తాన్ని పిండేయడమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మద్యపాన నిషేధమని చెప్పిన జగన్.. లాక్‌డౌన్‌లో ఎందుకు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీపై అంతేస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు. మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం ధరలను సీఎం జగన్ పెంచారని ఎమ్మెల్యే రోజా అన్నారు.

  సంపూర్ణ మద్యపాన నిషేధం ఖచ్చితంగా జరుగుతుంది. మద్యపాన నిషేధంలో భాగంగానే సీఎంగ జగన్ మధ్యం ధరలను పెంచారు. ధరలు పెరిగితే పేదవాడు మద్యానికి దూరం అవుతారు. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుకు బాధపడుతున్నారు? చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారితే సీఎం జగన్ దశలవారీగా మద్యం నిషేధానికి శ్రీకారుం చుట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్‌ షాపులు, 40 శాతం బార్లను తొలగించాం. కరోనా కట్టడికి సీఎం జగన్‌ తీవ్రంగా కృషి చేస్తుంటే, టీడీపీ నేతలు మాత్రం ఏపీ రూమ్‌ల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు.
  రోజా, వైసీపీ ఎమ్మెల్యే

  ఏపీలో దాదాపు 25శాతం మేర మద్యం ధరలు పెరిగాయి. రూ 120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.20 పెంచగా.. హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్‌బాటిల్‌పై రూ.80 పెంచారు. ఇక రూ.120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.40 పెంచగా..హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్‌ బాటిల్‌పై రూ. 120 మేర పెంచారు. అటు రూ.150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ.60 పెంచగా.. హాఫ్ బాటిల్‌పై రూ.120, ఫుల్ బాటిల్‌పై రూ.240 పెంచారు. మినీ బీర్ పై రూ.20, ఫుల్ బీర్ రూ.30కి పెంచుతున్నట్లు ఏపీ సర్కారు ధరలను నిర్ణయించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: AP News, Liquor sales, Liquor shops, MLA Roja, Roja Selvamani, Wine shops

  ఉత్తమ కథలు