జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్మాది, అరాచకవాది, పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కులం, మతం పేరుతో రాష్ట్రంలో ప్రజల మధ్య విభజన తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఓ వీడియో పోస్ట్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడికి సంబంధించిన వీడియో అది. అందులో ప్రధాన అర్చకుడు ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని సెక్యులర్ ప్రభుత్వాలకు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘దేవాలయాలకు వచ్చే ఆదాయంలో 23.4 శాతం ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు. అందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణ ఖర్చు (15శాతం), ఆడిట్ ఫీజు (2 శాతం), కామన్ గుడ్ ఫండ్ (2 శాతం), అర్చక సంక్షేమ సంఘం పేరుతో మరికొంత.. ఇలా రకరకాల పేర్లతో సుమారు 25 శాతం ఆదాయాన్ని ప్రభుత్వం తీసేసుకుంటోంది. మరి ఏ చర్చి, మసీదులకు వచ్చే ఆదాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదు. కేవలం హిందూ ఆలయాల నుంచే ఎందుకు వసూలు చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
Chilukuru Balaji temple’s ‘pradhana archakaulu’ Sri Rangarajan garu on article 26.
Worth listening... pic.twitter.com/FU9wzlToIt
— Pawan Kalyan (@PawanKalyan) November 24, 2019
పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన వీడియోకు మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత తామేమీ కొత్తగా చట్టం తీసుకురాలేదని, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దాన్నే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనను వదిలేసిన పవన్ కళ్యాణ్.. కేవలం ఐదు నెలల జగన్ పాలన మీద మాత్రమే విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. దీనిపై పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఆలయాల నిర్వహణకు జగన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. వచ్చే ఆదాయం కంటే ఎక్కువే ఖర్చు చేస్తోందని మల్లాది విష్ణు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, Janasena party, Pawan kalyan