హోమ్ /వార్తలు /national /

ఆ టికెట్లన్నీ చంద్రబాబు హయాంలోవే.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ఆ టికెట్లన్నీ చంద్రబాబు హయాంలోవే.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tirumala Bus Ticket: చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్ టికెట్స్‌పై హజ్ యాత్ర గురించి ప్రింట్ చేశారని, ఇప్పటికి అవే ఆర్టీసీలో కొనసాగుతున్నాయని విష్ణు తెలిపారు.

తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచార వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, పలు హిందూ సంస్థలు అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ ఈ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న టికెట్లను చంద్రబాబు హయాంలో ముద్రించినవేనని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు హయాంలో హిందూ మతానికి జరిగిన అవమానం రాష్ట్ర చరిత్రలో ఎన్నడు జరగలేదు.చంద్రబాబు సీఎంగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో, శ్రీ కాళహస్తిలో తాంత్రిక పూజలు జరిగాయి.విజయవాడలో 50 హిందు దేవాలయాలను కులదోశారు’ అని ప్రతిపక్ష టీడీపీపై నిప్పులు చెరిగారు.

tirumala bus ticket, haj yatra, jerusalem yatra, tirumala temple, tirupati news, ttd tickets, tirupati trains, ttd online, ttd darshan, tirumala laddu online, christianity campaign in tirumala, ap cm ys jagan, telugu news, జెరూసలేం యాత్ర, హజ్ యాత్ర, తిరుమల యాత్ర, తిరుపతి టికెట్లు, టీటీడీ
మల్లాది విష్ణు(ఫైల్ ఫోటో)

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్ టికెట్స్‌పై హజ్ యాత్ర గురించి ప్రింట్ చేశారని, ఇప్పటికి అవే ఆర్టీసీలో కొనసాగుతున్నాయని విష్ణు తెలిపారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, హజ్ యాత్ర, జెరూసలేం గురించి బస్ టికెట్స్ మీద ప్రచారం చేయించారు. అప్పుడే జీవో కూడా ఇచ్చారు. బస్ టికెట్స్ మీద ఉన్న వాటికి తమ ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని ఆయన వివరించారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులతో టీడీపీ, బీజేపీకి రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో, రాజకీయ లబ్ధి పొందేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘పుష్కరాల మరణాలు ఎవరి కాలంలో ఎక్కువగా జరిగాయో అందరికీ తెలుసు. సదావర్తి దేవుడు భూముల కాజేసిన చరిత్ర టీడీపీ నేతలది’ అని ఆరోపించారు.

raja singh, bjp mla raja singh, రాజా సింగ్, haj yatra, jerusalem yatra, tirumala temple, tirupati news, ttd tickets, tirupati trains, ttd online, ttd darshan, tirumala laddu online, christianity campaign in tirumala, ap cm ys jagan, telugu news, జెరూసలేం యాత్ర, హజ్ యాత్ర, తిరుమల యాత్ర, తిరుపతి టికెట్లు, టీటీడీ
బస్ టికెట్‌పై హజ్, జెరూసలేం యాత్ర యాడ్స్

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ట్రాప్‌లో పడుతున్నారని, ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల బస్ టికెట్స్ వ్యవహారంపై ఇప్పటికే విచారణకు దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: AP News, Bjp, Raja Singh, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati, Ttd

ఉత్తమ కథలు