హోమ్ /వార్తలు /national /

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు..

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు..

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

రఘురామకృష్ణంరాజు ఓ ఆర్థిక నేరస్తుడని... అతడిపై ఢిల్లీలో 420 కేసు నమోదైందని వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.

  తనపై ఆరోపణలు చేసిన నరసారపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు విశ్వాసఘాతకుడని ఆరోపించారు. ఆయన ఇంత దుర్మార్గుడని అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు ఓ ఆర్థిక నేరస్తుడని... అతడిపై ఢిల్లీలో 420 కేసు నమోదైందని తెలిపారు. కేవలం సీఎం జగన్, పార్టీ ఆదేశాల వల్లే అతడి గెలుపు కోసం తామంతా కలిసి పని చేశామని చెప్పారు. జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతోందని అన్నారు. రఘురామకృష్ణంరాజు విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా... తాము కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే అతడిని కలుపుకుపోయే పరిస్థితి రాదని అన్నారు. తనను గెలిపించిన పార్టీ కార్యకర్తలపైనే రఘురామకృష్ణంరాజు కేసులు పెడుతున్నారని విమర్శించారు.

  మరోవైపు ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుపై నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వైసీపీ అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju, Ysrcp

  ఉత్తమ కథలు