హోమ్ /వార్తలు /national /

టీడీపీ నేత పట్టాభి హత్యకు కుట్ర? -కాపాడుకోమంటూ ఫ్యామిలీకి వార్నింగ్ -వైసీపీ ఎమ్మెల్యే చెప్పేది నిజమేనా?

టీడీపీ నేత పట్టాభి హత్యకు కుట్ర? -కాపాడుకోమంటూ ఫ్యామిలీకి వార్నింగ్ -వైసీపీ ఎమ్మెల్యే చెప్పేది నిజమేనా?

చంద్రబాబుతో పట్టాభి(ఫైల్)

చంద్రబాబుతో పట్టాభి(ఫైల్)

ఏపీలో రచ్చ రేపి, జాతీయ స్థాయిలోనూ సెగలు పుట్టిస్తోన్న ‘బోషిడికే’ వివాదం నెత్తుటి మలుపు తిరగనుందా? డ్రగ్స్ కేసులో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇకపై హత్యారాజకీయాలుగా మారనున్నాయా? టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి ప్రాణహాని ఉందా? ఆయనను అంతం చేయాలనుకుంటోన్న వాళ్లెవరు?

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ లో పెను దుమారం రేపి, ఇప్పుడు ఢిల్లీలోనూ ఫిర్యాదుల పర్వం కొనసాగుతోన్న ‘బోషిడికే’ వివాదంలో రాబోయే రోజుల్లో రక్తసిక్తం కానుందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పదంతో దూషించిన టీడీపీ అధికార ప్రతినిది పట్టాభికి ప్రాణహాని ఉందా? ప్రస్తుతం దేశం విడిచివెళ్లిపోయినట్లుగా చెబుతోన్న పట్టాభిని పైలోకాలకు పంపేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు అధికార వైసీపీ నేతలు.

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య దాడులు, మాటల యుద్ధానికి కారణమైన ‘బోషిడికే’ వివాదానికి సంబంధించి ప్రధాన ముద్దాయిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అలియాస్ పట్టాభి గురించి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభికి ప్రాణహాని ఉందని, ఈ విషయంలో ఆయన కుటుంబీకులు జాగ్రత్త వహించాలంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. కాకినాడ సిటీలోని డి-కన్వెన్షన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఈ కామెంట్లు చేశారు.

ఏపీలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పేరు ప్రధానంగా వినిపిస్తుండటం, ఈ అంశంపై జరిగిన అన్ని ప్రెస్ మీట్లలోనూ టీడీపీ నేతలు, మరీ ప్రత్యేకించి అధికార ప్రతినిధి పట్టాభి పదేపదే ద్వారంపూడికి డ్రగ్స్ కేసుతో లింకులున్నాయని ఆరోపించడం తెలిసిందే. వైసీపీతోపాటు పోలీసులు సైతం డ్రగ్స్ వ్యవహారాలతో ద్వారంపూడికి లింకులు లేవని చెబుతూ వచ్చారు. ఒకవేళ డ్రగ్స్ రాకెట్ తో వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని నిరూపించగలిగే ఆధారాలుంటే ఇవ్వాలంటూ పోలీసులు.. టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేయడంపైనే పట్టాభి మండిపడుతూ ‘బోషిడికే’పదాన్ని వాడారు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడులు, పట్టాభి అరెస్టు తర్వాత సీన్ ఇప్పుడు ఢిల్లీకి మారింది. జగన్ సర్కారు ఉగ్రచర్యలకు పాల్పడుతోందని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ తో చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పట్టాభి ప్రాణాలకు ముప్పుఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి బాంబు పేల్చారు. కాగా,

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి ప్రాణహాని పొంచి ఉన్నది బయటి వాళ్లతో కాదని, సాక్ష్యాత్తూ పార్టీ అధినేత చంద్రబాబుతోనే అని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడే మనస్తత్వం చంద్రబాబుదని, ప్రస్తుత వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న పట్టాభిని అంతం చేయాలనుకోవడం ద్వారా చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైసీపీ మీదకు నెట్టేసి ప్రజల్లో సానుభూతి పొందాలనుకునే కుట్రపూరిత తత్వం చంద్రబాబుది. ఈ విషయంలో పట్టాభి ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి’అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.


ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు.. తన పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతాడని, ప్రస్తుతం ఢిల్లీలో అతను చేస్తోన్న ఫీట్లే అందుకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘ఒకప్పుడు అమిత్ షా ఏపీ(తిరుపతి)కి వస్తే ఆయన కాన్వాయ్ పై చంద్రబాబు రాళ్లేయించాడు. మళ్లీ ఇప్పుడు ఇదే చంద్రబాబు అదే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో కాపుకాస్తున్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు వ్యవహారం మరొకటి ఉంటుందా?’అని ద్వారంపూడి నిలదీశారు. పట్టాభికి ప్రాణహానిపై చంద్రబాబును అనుమానిస్తూ వైసీపీ ఎమ్మెల్యే చేసిన హెచ్చరికలపై టీడీపీ నేత కుటుంబం స్పందించలేదు. కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో వైరలైన ఫొటోలను బట్టి, పట్టాభి ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Drugs case, TDP, Ysrcp

ఉత్తమ కథలు