హోమ్ /వార్తలు /national /

Roja Selvamani: నిప్పులు చెరిగిన రోజా సెల్వమణి .. సభలోనే వార్నింగ్.. ఇంకోసారి నా జోలికొస్తే..

Roja Selvamani: నిప్పులు చెరిగిన రోజా సెల్వమణి .. సభలోనే వార్నింగ్.. ఇంకోసారి నా జోలికొస్తే..

సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతుంది.

సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్‌లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతుంది.

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి రుద్రావతారం ఎత్తారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలోనే నిప్పులు చెరిగారు. నగరి నియోజకవర్గాన్ని తాను ఇండస్ట్రియల్ హబ్‌గా తయారు చేస్తుంటే కొందరు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంకా చదవండి ...

  వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి రుద్రావతారం ఎత్తారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలోనే నిప్పులు చెరిగారు. నగరి నియోజకవర్గాన్ని తాను ఇండస్ట్రియల్ హబ్‌గా తయారు చేస్తుంటే కొందరు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తన మీద ఇలా చేయడం చూసి చాలా బాధేసిందన్నారు. ‘ఒక బాధ్యత కలిగిన నేతగా నేను ముందుకొచ్చారు. నిన్న కొందరు పుత్తూరు నేతలు ప్రెస్ మీట పెట్టారు. నాకు వాటాలు రానందుకు ఆవేదన చెందుతున్నానని అన్నారు. ఆ వార్త చూసి చాలా బాధేసింది. ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా నా నగరి నియోజకవర్గానికి ఫ్యాక్టరీలు వస్తే చుట్టుపక్కల కమర్షియల్‌గా అభివృద్ధి చెందుతుంది. పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయి. పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఈ రోజు కూలి పని చేసుకుంటున్నారు. జగన్ ఆశీర్వాదంతో నా నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చేందుకు కష్టపడుతున్నా. కానీ, కొందరు జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. దాని మీద నేను ఆవేదన చెందా. ఆడపిల్ల అనే జాలి కూడా లేకుండా వెటకారం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేశారు. ఇప్పటి వరకు నేను వారి గురించి మాట్లాడలేదు. 30 ఏళ్లుగా వాళ్ల నాన్న రాజకీయాల్లో ఉండి ఏం చేశారని నేను అడగలేదు. ఈ రోజు అధికారం వచ్చిందని అధికారం చెలాయించే దాన్ని కూడా కాదు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం.’ అని రోజా సెల్వమణి అన్నారు.

  చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపీఐఐసీ చైర్ పర్సన్ అయిన రోజా సెల్వమణి మధ్య తీవ్రంగా కోల్డ్ వార్ నడుస్తోంది. నగరిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 500 ఎకరాలు కేటాయించే ఏర్పాట్లు కూడా రోజా చేసినట్టు తెలిసింది. అయితే, చివరి నిమిషంలో ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు ఇవ్వాలనే ప్రతిపాదన అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీని వెనుక డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని రోజా వర్గం భావిస్తోంది. తన నియోజకవర్గంలో ప్రతి దాన్ని కూడా వారిద్దరూ అడ్డుకుంటున్నారనే అభిప్రాయాన్ని ఆమె పరోక్షంగా వ్యక్తం చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, MLA Roja, Nagari, Roja Selvamani, Ysrcp

  ఉత్తమ కథలు