హోమ్ /వార్తలు /national /

Chandrababu-MLC Iqbal: ఆ ఘటనపై స్పందించడం లేదేంటి..? చంద్రబాబును నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్

Chandrababu-MLC Iqbal: ఆ ఘటనపై స్పందించడం లేదేంటి..? చంద్రబాబును నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్

మాజీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్సీ ఇక్బాల్ (ఫైల్ ఫొటోలు)

మాజీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్సీ ఇక్బాల్ (ఫైల్ ఫొటోలు)

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర డీజీపీ ప్రకటన చేస్తే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, లోకేష్ ఎందుకు భయపడతున్నారని ఇక్బాల్ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ, ఐటీ ఎవ్వరూ రాష్ట్రానికి రానీయలేదని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

ఇంకా చదవండి ...

    హిందూపురం (అనంతపురం): అంతర్వేదిలో రథం దగ్దమైన ఘటనలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన నిప్పులు చెరిగారు. హిందూపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు ఘటనపై చంద్రబాబు ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర డీజీపీ ప్రకటన చేస్తే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, లోకేష్ ఎందుకు భయపడతున్నారని ఇక్బాల్ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ, ఐటీ ఎవ్వరూ రాష్ట్రానికి రానీయలేదని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేలా కొందరు కుట్ర చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

    మత సామరస్యాన్ని కాపాడేందుకు జగన్ సర్కారు తీవ్ర కృషి చేస్తోందని ఇక్బాల్ వ్యాఖ్యానించారు. కుల, మత, వర్గ బేధాలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అందువల్లే పలు సర్వేల్లో దేశంలో మూడో ఉత్తమ సీఎంగా జగన్‌ మోహన్ రెడ్డి నిలిచారని గుర్తు చేశారు. దేవాలయాల పరిరక్షణ వైసీపీ సర్కారు బాధ్యతేననీ, అందుకు జగన్ తీసుకుంటున్న చర్యలను అందరూ స్వాగతిస్తున్నారన్నారు. ‘రాష్ట్రంలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ ప్రచారం చేసింది. అభివృద్ధి, సంక్షేమం మీదనే జగన్ ఓట్లు అడిగితే ప్రజలు ఏకంగా 151 సీట్లు ఇచ్చారు. నాకంటే వైవీ సుబ్బారెడ్డి గొప్ప హిందువు అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా ఎప్పుడో చెప్పారు. టీటీడీ ఆడిటింగ్‌ను కాగ్‌ ద్వారా చేయాలని జగన్ నిర్ణయించారని ఆయనే చెప్పారు. ప్రజల్లో జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది‘ అని ఇక్బాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

    నేరానికి ఎవరు పాల్పడినా జగన్ ఉపేక్షించరనీ, కుల మతాలు చూడరని ఇక్బాల్ తేల్చిచెప్పారు. పాస్టర్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. మతసామరస్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీజేపీ మెప్పుకోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీకి సమాధి కట్టేశారనీ, ఆ విషయం గ్రహించకుండా మత విద్వేషాలు చెలరేగడానికి కుట్ర చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలను జగన్ సర్కారు ఉపేక్షించదన్నారు. తిరుమలపై జీఓ ఇచ్చి, అన్యమత ప్రచారం జరగకుండా చేసింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజల మధ్య మత సామరస్యం ఉందనీ, ఇప్పటికైనా ప్రతిపక్షాలు దిగజారుడు అనైతిక రాజకీయాలు మానేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను అందిస్తూ జగన్, ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు.

    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bhuma Akhilapriya, Chandrababu naidu, Tirumala tirupati devasthanam, Ysr pelli kanuka

    ఉత్తమ కథలు