హోమ్ /వార్తలు /national /

YS Sharmila: వైఎస్ సమాధి వద్ద షర్మిల పార్టీ జెండా.. ఇడుపులపాయలో ప్రార్థనలు..

YS Sharmila: వైఎస్ సమాధి వద్ద షర్మిల పార్టీ జెండా.. ఇడుపులపాయలో ప్రార్థనలు..

వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఆమె తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, కుమారుడు రాజారెడ్డి హాజరవుతారు. షర్మిల పార్టీ కోర్ టీమ్‌గా ఉన్న కొండా రాఘవరెడ్డి, పిట్టం రాంరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు సభా వేదికపై జెండా ఆవిష్కరణలో పాలుపంచుకుంటారు.

ఇంకా చదవండి ...

  నేడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కూతురు వైఎస్‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల భర్త అనిల్‌కుమార్‌, తల్లి విజయమ్మ, వైఎస్‌ వివేకా కుమార్తె సునీతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, షర్మిల పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇవాళే తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు షర్మిల. ఆ పార్టీ పేరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ (YSRTP). ఇవాళ పార్టీ ప్రకటన నేపథ్యంలో తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి వైఎస్ షర్మిల ప్రార్థనలు చేశారు. అనంతరం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. షర్మిల పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా విజయమ్మ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

  ఇక ఇవాళే తెలంగాణలో ఇవాళే షర్మిల పార్టీ పురుడుపోసుకోనుంది. సాయంత్రం తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు షర్మిల. ఇడుపుల పాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన షర్మిల.. మరికాసేపట్లో కడప నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడ షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ, బోనాలతో స్వాగతించనున్నారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి షర్మిల చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వేదికపై ఏర్పాటు చేసిన.. తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన, లక్ష్యాలు, ఎజెండాపై దాదాపు గంటా 15 నిమిషాలపాటు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.


  వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఆమె తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, కుమారుడు రాజారెడ్డి హాజరవుతారు. షర్మిల పార్టీ కోర్ టీమ్‌గా ఉన్న కొండా రాఘవరెడ్డి, పిట్టం రాంరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు సభా వేదికపై జెండా ఆవిష్కరణలో పాలుపంచుకుంటారు. ఈ సభకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకురావడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు వైఎస్ షర్మిల ఇది వరకే ప్రకటించారు. టీఆర్ఎస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. గతంలో వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళన పేరుతో వైఎస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా సమావేశమై పార్టీ ఏర్పాటు, విధివిధానాల గురించి చర్చించారు. ఏప్రిలల్ 9న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత నిరుద్యోగ దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్, బీజేపీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ఇవాళ పార్టీ ఆవిర్భావ సభలో ఆమె ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ys jagan mohan reddy, YS Sharmila

  ఉత్తమ కథలు