హోమ్ /వార్తలు /national /

WomensDay 2020 | మహిళా నేతలకు సీఎం జగన్ ఉమెన్స్ డే గిఫ్ట్...

WomensDay 2020 | మహిళా నేతలకు సీఎం జగన్ ఉమెన్స్ డే గిఫ్ట్...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)

International Womens Day | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళా నేతలకు ఓ రకంగా ఉమెన్స్ డే బహుమతి ఇచ్చారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళా నేతలకు ఓ రకంగా ఉమెన్స్ డే బహుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జెడ్పీ చైర్ పర్సన్ రిజర్వేషన్లలో మహిళలకే అగ్రతాంబూలం అందించారు. ఈనెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీ చైర్ పర్సన్ రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకే ఎక్కువ సీట్లు దక్కాయి. ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉండగా, అందులో 8 జిల్లాల్లో మహిళలే జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌లు కానున్నారు. అందులోనూ ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఓ ఎస్టీ, ముగ్గురు ఇతర సామాజికవర్గాలకు చెందిన మహిళామణులు జెడ్పీ చైర్ పర్సన్లుగా ఎన్నిక కానున్నారు.

  శ్రీకాకుళం - బీసీ (మహిళ)

  అనంతపురం - బీసీ (మహిళ)

  గుంటూరు - ఎస్సీ (మహిళ)

  తూర్పుగోదావరి - ఎస్సీ (మహిళ)

  విశాఖ - ఎస్టీ (మహిళ)

  ప్రకాశం - జనరల్ (మహిళ)

  నెల్లూరు - జనరల్ (మహిళ)

  కృష్ణా - జనరల్ (మహిళ)

  విజయనగరం - జనరల్

  చిత్తూరు - జనరల్

  కడప - జనరల్

  కర్నూలు - జనరల్

  పశ్చిమగోదావరి - బీసీ

  రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే పదవులు అన్నింట్లోనూ 50శాతం కచ్చితంగా మహిళలకు ఇవ్వాలని సీఎం జగన్ సర్కారు నిర్ణయించింది. పదవులతో పాటు ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లో కూడా మహిళలకే సగం వాటా ఇవ్వాలని ఆదేశించింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Womens Day 2020

  ఉత్తమ కథలు