హోమ్ /వార్తలు /national /

సీల్డ్ కవర్ నివేదిక సరిగా లేదు.. జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సీరియస్

సీల్డ్ కవర్ నివేదిక సరిగా లేదు.. జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సీరియస్

జగన్‌పై దాడి జరిగినప్పటి చిత్రం, హైకోర్టు(File)

జగన్‌పై దాడి జరిగినప్పటి చిత్రం, హైకోర్టు(File)

శుక్రవారంలోగా కేసును ఎన్‌ఐఏకు మీరు బదిలీ చేస్తారా? లేక మమ్మల్నే బదిలీ చేయమంటారా అని కూడా కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించిందని జగన్ తరపు న్యాయవాది తెలిపారు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. కేసు దర్యాప్తునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించిన సీల్డ్ కవర్ నివేదికపై ఫైర్ అయ్యింది. సీల్డ్ కవర్ నివేదిక సరిగా లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక పంపించాలని కేంద్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ చేసింది. కేసు విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

Stabbing case: visakhapatnam court issues notices to ys jagan
వైఎస్ జగన్

కేంద్ర ప్రభుత్వం పంపిన సీల్డ్‌ కవర్‌ నివేదిక విషయంలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని జగన్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారంలోగా కేసును ఎన్‌ఐఏకు మీరు బదిలీ చేస్తారా? లేక మమ్మల్నే బదిలీ చేయమంటారా అని కూడా కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పుకొచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించే అంశంపై పరిశీలన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదిక పంపింది.

attack on jagan case: accused srinivas rao remand report వైఎస్ జగన్‌పై దాడి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఐతే జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
నిందితుడు శ్రీనివాసరావు, గాయపడిన జగన్(File)

హత్యాయత్నం జరిగిన ప్రాంతం ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేస్తామని కేంద్రం పేర్కొంది. ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని కూడా కేంద్రం దర్యాప్తు సంస్థ వివరించింది.అయితే ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో పంపిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పూర్తి స్థాయి నివేదిక పంపాలని ఆదేశించింది.

దాడిలో గాయపడిన జగన్, దాడి చేసిన ఆయుధం
గాయపడిన జగన్, దాడి చేసిన ఆయుధం

ఈ ఏడాది అక్టోబరులో జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. విమానాశ్రయంలోనే పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన జగన్‌.. హైదరాబాద్‌లో చికిత్స పొందారు.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, High Court, Ys jagan, Ysrcp