హోమ్ /వార్తలు /national /

YS Jagan: భూమికి దూరంగా.. జూమ్ కి దగ్గరగా.. దత్తపుత్రలతో రాజకీయం..

YS Jagan: భూమికి దూరంగా.. జూమ్ కి దగ్గరగా.. దత్తపుత్రలతో రాజకీయం..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

  ప్రతిపక్ష పార్టీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు సంధించారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు విడుదల చేసిన జగన్.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ మాట్లాడుతూ “జూమ్ కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉండే నాయుడుగారు.. తన పుత్రుడ్ని, దత్తపుత్రుడ్ని రంగంలోకి దించుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరిపైనా నమ్మకం లేకపోవడంతో ఒకేసారి ఇద్దర్నీ పంపుతారు. రైతు భరోసా,ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటించినా.. సరిగ్గా ఒక్కరోజు ముందు హైదరాబాద్ నుంచి దిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇద్దరికీ రైతులపై ప్రేమ లేదని., రైతుల కష్టాలు పట్టలేదన్నారు. రైతు కష్టాలను ఒక్కసారి కూడా పట్టించుకోనే నేతలు.. అన్నీ సక్రమంగా జరుగుతున్నా వక్రబుద్ధితో విమర్శలు చేస్తున్నారని” మండిపడ్డారు.

  రైతుల ఖాతాల్లో నగదు జమ

  ఇక రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం, ఇన్ పుట్ సబ్సిడీ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేసింది. రైతు భరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన రైతులకు పెట్టుబడి ఇన్ పుట్ సబ్సిడీ పథకం కింద రూ.646 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.., రైతులకు మంచి ధరలు రావాలనేదే మా లక్ష్యమని స్పష్టం చేశారు.

  బకాయిలు మేమే తీర్చాం

  గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచిందని.., రైతులకు కనీసం కేవలం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని జగన్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిందని.. వాటి బకాయిలన్నింటినీ తామే చెల్లించినట్లు సీఎం గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న 434 రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించామన్నారు. ఇప్పటికే రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద రూ.13,101 కోట్లు అందించామని.. రైతులకు ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని జగన్ అన్నారు. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేసిన ఘనత తమదేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

  రైతుల కోసం ఇన్ని మంచి పనులు చేస్తుంటే.., ప్రతిపక్షాలు మాత్రం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు తాను ఇచ్చిన మాటను తప్పలేదని.. చెప్పిన తేదీకి చెప్పినట్లు పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై రాజకీయాలు చేయడం తగదన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Nara Lokesh, Pawan kalyan, Ysrcp

  ఉత్తమ కథలు