హోమ్ /వార్తలు /national /

సీఎం జగన్ దానికి బ్రాండ్ అంబాసిడర్.. టీడీపీ నేత సెటైర్

సీఎం జగన్ దానికి బ్రాండ్ అంబాసిడర్.. టీడీపీ నేత సెటైర్

దేవినేని ఉమ (ఫైల్ ఫొటో)

దేవినేని ఉమ (ఫైల్ ఫొటో)

Devineni Uma | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. జగన్ బాధ్యతా రాహిత్యం, అవగాహన రాహిత్యం వల్ల పోలవరం పనులు పడకేశాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నత్తనడకన సాగుతున్నాయి, విలువైన సీజన్ సమయాన్ని పోగొట్టి ఆంధ్ర జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేయడానికి వైసీసీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. 2019 నాటికి పూర్తి చేయవలసిన గేట్ల నిర్మాణాన్ని స్వార్ధ ప్రయోజనాలు, కక్ష సాధింపుల కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ డ్రామాలు అడుతున్నారన్నారు. గైడ్ లైన్స్ ఏమి ఫాలో అవ్వకుండా ఒకే ఒక్క కంపెనీకి టెండర్ ఇచ్చి టీడీపీ మీద కక్ష సాధించడం కోసం పోలవరాన్ని ఆంధ్రులకు శాపంగా మార్చారని మండిపడ్డారు. 2019లో ఉత్తమ జాతీయ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న పోలవరం 2020లో ఎందుకు పేరు తెచ్చుకొలేక పోయిందని దేవినేని ఉమా ప్రశ్నించారు.

  రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ ను గాలికి వదిలి వేసి ప్రచార అర్భాటాల కోసం ప్రాకులాడుతున్నారని మండిపడ్డారు. ‘గతంలో పోలవరం డ్యామ్ పనులను చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సందర్శించటం, ఇంజనీర్లు, ప్రజలకు తెలియజేసేవారు. నేడు రాష్ట్రంలోని 62 ప్రాజెక్ట్ లకు సంబంధించిన సమాచారం ఉంచడం లేదు. పోలవరం పనుల పురోగతిని ఎందుకు దాస్తున్నారు? ఇంజనీరింగ్ చీఫ్ ఎందుకు ప్రాజెక్ట్ సైట్ లో లేరో వైసీపీ నాయకులు చెప్పాలి? ప్రాజెక్ట్ లలో మీ అవీనితి ఆక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రాజెక్టుల విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. పోలవరం టెండర్ సింగిల్ టెండర్ ఎలా అయింది? సింగిల్ టెండర్ రిజర్వ్ టెండర్ ఎలా అయింది? మీ అవినీతి,ఆక్రమ సంపాదన కోసం పోలవరాన్ని నీరుగార్చితే సహించేది లేదు.’ అని దేవినేని ఉమా హెచ్చరించారు.

  గోదావరి పెన్నా అనుసంధానం పనులు ఎందుకు అపేశారని ప్రశ్నించారు. అప్పుడు పట్టిసీమ దండగన్నారు. నేడు పట్టీసీమ రైతులకు వరం అయ్యిందని చెప్పారు. జగన్ అసమర్ధ పాలన వల్ల నదుల నుంచి వేల క్యూసెక్యుల నీరు సముద్రం పాలయ్యిందని చెప్పారు. మంత్రుల అనుచరులు పంది కొక్కులాగా ఇసుకను తొవ్వకుంటున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. ‘ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో జరిగిన ఆక్రమాల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మంత్రుల చేత బూతులు తిట్టిస్తారా? రాజప్రసాదాల మంత్రి సజ్జల వస్తారా ముఖ్యమంత్రి జగన్ వస్తారా మీ అవినీతి అక్రమాల గురించి చర్చించడానికి సిద్దంగా ఉన్నాం.’ అని దేవినేని అన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Devineni Uma Maheswara Rao

  ఉత్తమ కథలు