హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UPలో కీలక పరిణామం,సీఎం యోగికి షాక్..మంత్రి రాజీనామా,మరో మంత్రి ఢిల్లీలో

UPలో కీలక పరిణామం,సీఎం యోగికి షాక్..మంత్రి రాజీనామా,మరో మంత్రి ఢిల్లీలో

యోగి ఆదిత్యనాథ్ (ఫైల్ ఫోటో)

యోగి ఆదిత్యనాథ్ (ఫైల్ ఫోటో)

Yogi Adityanath Cabinet Trouble: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో లుకలుకలు మొదలయ్యాయి. యోగి ఆదిత్యనాథ్‌ కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సీఎం యోగిపై ఇద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఏకంగా రాజీనామానే సమర్పించగా.. మరొకరు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.

ఇంకా చదవండి ...

Yogi Adityanath Cabinet Trouble: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో లుకలుకలు మొదలయ్యాయి. యోగి ఆదిత్యనాథ్‌ కు సొంత మంత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సీఎం యోగిపై ఇద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఏకంగా రాజీనామానే సమర్పించగా.. మరొకరు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ ప్రభుత్వాల్లో ఇలా సొంత నేతల నుంచే బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం కావడమనేది అరుదు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పలుచోట్ల బీజేపీ నేతల్లో అసంతృప్తి ఉన్నా ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తం కాలేదు. అలాంటిది యూపీ లాంటి రాష్ట్రంలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.

తాను దళితుడిని కావడం వల్లే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జలశక్తి శాఖ మంత్రి దినేశ్ ఖటీక్‌ బుధవారం రాజీనామా చేశారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాజీనామా లేఖను పంపి, అవినీతి ఆరోపణలు చేశారు. అమిత్ షాకు పంపిన రాజీనామా లేఖలో.."నా సామాజిక వర్గం కారణంగా నాకు గౌరవం దక్కడం లేదు. ఒక మంత్రిగా నాకు ఎలాంటి అధికారం లేదు. నేను మంత్రిని కాబట్టి నాకో కారు ఇచ్చారు. గత వంద రోజులుగా నాకు ఎలాంటి పని లేదు. అధికారిక సమావేశాలకు పిలవలేదు. నా శాఖ గురించే నాకు ఏమీ చెప్పడం లేదు. ఇది దళిత సమాజానికి అవమానమే. ఇలా నేను మంత్రిగా ఉండటం దళిత సమాజానికి ఏ ప్రయోజనమూ లేదు. ఇది నాకు ఎంతో ఆవేదన కలిగిస్తోంది. బదిలీల్లో అవినీతి చోటుచేసుకుంది. దాని గురించి అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. నా శాఖ కార్యదర్శి నా మాట వినడం లేదు. నమామీ గంగ పథకంలో కూడా అవినీతి చోటుచేసుకుంటోంది. ఇవన్నీ నన్ను బాధకు గురిచేశాయి. అందుకే రాజీనామా చేస్తున్నా"అని దినేశ్ ఆరోపించారు. ఖటీక్‌ను బుజ్జగించి రాజీనామాను ఉపసంహరింపజేసేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.

4 Zodiac Signs : రాబోయే 119 రోజులు ఈ నాలుగు రాశుల వారికి మహర్దశ..పట్టిందల్లా బంగారమే!

యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తన శాఖలో సీఎం కార్యాలయం వేలుపెడుతోందని,తన అధికారులను బదిలీ చేస్తోందని ప్రజాపనుల శాఖ(PWD)మంత్రి జితిన్‌ ప్రసాద అలిగి ఢిల్లీ వెళ్లారు. అమిత్‌ షాకు ఫిర్యాదు చేసేందుకు జితిన్‌ ప్రసాద ప్రయత్నిస్తున్నారు. యోగి సీఎంగా ఉన్న తొలి ఐదేళ్లలో ఇలాంటి అసమ్మతి లేదు. ప్రజాపనుల శాఖలో జరిగిన బదిలీల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఐదుగురు సీనియర్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అందులో జితిన్ ప్రసాద ఓఎస్‌డీ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సీఎం యోగి ఇటీవల జితిన్ ప్రసాదను పిలిపించి మందలించారని.. దీనితో జితిన్ ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారని అంటున్నాయి.

అంతకుముందు యూపీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేశ్ పాథక్‌ తన నిరసన గళాన్ని వినిపించారు.

First published:

Tags: Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు