హోమ్ /వార్తలు /జాతీయం /

కర్ణాటక సీఎంగా నాలుగోసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

కర్ణాటక సీఎంగా నాలుగోసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

యడ్యూరప్ప

యడ్యూరప్ప

యడ్యూరప్ప 2007లో మొదటిసారి, 2008లో రెండోసారి, 2018లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే, గతంలో మూడుసార్లు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. విశ్వాస పరీక్ష సందర్బంగా బలం నిరూపించుకోలేక కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో 105 మంది సభ్యులతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో యడ్యూరప్ప ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా.. యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులు ఎవ్వరూ ప్రమాణస్వీకారం చేయలేదు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జి మురళీధర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల నేతలు గైర్హాజరయ్యారు. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగో సారి. 2007లో మొదటిసారి, 2008లో రెండోసారి, 2018లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే, గతంలో మూడుసార్లు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు.

ప్రస్తుతం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్న తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సంచలన నిర్నయం తీసుకున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించారు. 2023 వరకు వారు పోటీ చేయడానికి కూడా అనర్హులుగా ప్రకటించారు.

First published:

Tags: Bjp, Karnataka Politics, Yeddyurappa

ఉత్తమ కథలు