హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Yediyurappa: తన నిర్ణయంతో బీజేపీలో ప్రకంపనలు రేపుతున్న యడియూరప్ప.. బీజేపీలో ఉంటూనే..

Yediyurappa: తన నిర్ణయంతో బీజేపీలో ప్రకంపనలు రేపుతున్న యడియూరప్ప.. బీజేపీలో ఉంటూనే..

యడియూరప్ప

యడియూరప్ప

తన అనుచరులకు మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత లభించలేదనే భావనలో యడియూరప్ప ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు బొమ్మై సారథ్యంలో ప్రభుత్వం కొనసాగుతుంటే.. యడియూరప్ప వర్గంగా చెప్పబడుతున్న నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత పరిస్థితులు మరింత జఠిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప( BS Yediyurappa) అవలంభిస్తున్న వైఖరే కారణం. తనను అకారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని బీఎస్‌ యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలో పర్యటించినున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇంతవరకు యడియూరప్ప సీఎం బసవరాజు బొమ్మైకు(Basavaraj Bommai) వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తన అనుచరులకు మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత లభించలేదనే భావనలో యడియూరప్ప ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు బొమ్మై సారథ్యంలో ప్రభుత్వం కొనసాగుతుంటే.. యడియూరప్ప వర్గంగా చెప్పబడుతున్న నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కన్నడనాట(Karnataka) ప్రచారం జరుగుతంది.

  ఇక, ముఖ్యమంత్రి మార్పు తర్వాత యడియూరప్ప.. చాలా వరకు మౌనంగానే ఉంటున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఆయన మాల్దీవులు పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాతే ఆయన రాష్ట్రంలో పర్యటన చేపట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈ పర్యటనలో యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర(BY Vijayendra) కీలకంగా వ్యవహరించునున్నారనే కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటీవల శివమొగ్గలో(Shivamogga) పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప యడియూరప్పను కలిశారు. దీంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  Huzurabad by Poll: హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. ఆ మహిళ నేతకు మెజారిటీ నాయకుల మద్దతు..!


  అయితే బీజేపీలో ఉంటూనే తన బలం చూపించుకునే విధంగా యడియూరప్ప వ్యుహాలు రచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కుమారుడు విజయేంద్రను బలమైన నాయకుడిగా నిలిపేందుకు యడియూరప్ప ప్రయత్నాలు జరుపుతున్నారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. ఇప్పుడి ఈ పరిణామాలు రాష్ట్ర బీజేపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. ఎలాగైనా యడియూరప్ప రాష్ట్ర పర్యటన వాయిదా వేయించేలా చూడాలని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నాయకత్వం చేపట్టిన కొద్ది రోజులకే.. యడియూరప్ప ఇలాంటి పర్యటనలు చేపట్టడం కొత్త సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర బీజేపీ నేతలు భయపడుతున్నారు.

  Bumper Offer to Villegers: గ్రామ ప్రజలకు బంపర్ ఆఫర్.. మహిళా సర్పంచ్ నిర్ణయంపై ప్రశంసలు


  ఈ పరిణామాల నేథ్యంలో కర్ణాటక బీజేపీ ఇంచార్జ్ అరుణ్ సింగ్(Arun Singh) సోమవారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఆయన పార్టీలోని పలువురు ముఖ్య నేతలతో మాట్లాడి.. యడియూరప్ప పర్యటన విరమించేలా ఒప్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే తన పర్యటనపై అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను మూడు రోజులు కర్ణాటకలో ఉంటాను. కొన్ని సంస్థాగత సమస్యలను పరిష్కరించడంతో పాటు, పలు అంశాలు ఎజెండాలోఉన్నాయి. యడియూరప్ప చాలా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన రాష్ట్రంలో పర్యటించాలనుకుంటే.. అలా ముందుకు సాగనిద్దాం. ఇది పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది’అని తెలిపారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Basavaraj Bommai, Bjp, Karnataka, Yeddyurappa

  ఉత్తమ కథలు