హోమ్ /వార్తలు /national /

RRR: చెప్పినట్టే వైసీపీకి ఎంపీ రఘురామ మరో షాక్.. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్

RRR: చెప్పినట్టే వైసీపీకి ఎంపీ రఘురామ మరో షాక్.. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్

ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

ఎంపీ రఘురామ వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆయన.. తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు. బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బెయిల్ రద్దు పిటిషన్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 25న జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ బెయిల్ రద్దు అవుతుందా.? కొనసాగుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదే సమయంలో మరో బాంబ్ పేల్చారు వైసీబీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. విదేశాలకు పారిపోయిందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. విదేశాలకు పారిపోయేందుకు విజయసాయి చూస్తున్నారని, 2 రోజుల్లో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ గతంలోనే ప్రకటించారు. ఆయన గతంలో చెప్పినట్టే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..

ఇప్పటికే ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు.

జగన్ సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. అయితే తమను ఇంతలా ఇబ్బంది పెడుతున్న రఘురామను ఏం చేయాలో తెలియన వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏదో ఒక కేసు పేరుతో అరెస్ట్ చేసినా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అటు ఎంపీ పదవి నుంచి వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా.. ఆ వ్యవహారం ముందుకు కదలడం లేదు. దీంతో ఆయన పేరు ఎత్తు తేనే వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju, Vijayasai reddy

ఉత్తమ కథలు