ఏపీలో మద్య నిషేధం దిశగా జగన్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే లిక్కర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే, లిక్కర్ ధరల పెంపును టీడీపీ ఖండించింది. ఈ పెంపుతో నాటు సారా వినియోగం పెరుగుతుందని, సామాన్యుడిపై పెంపు భారం పడుతుందని వాదిస్తోంది. లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు ఏపీలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో తెరిచారని, మద్యం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు.
అయితే, చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడని చురక అంటించారు. ఈ మేరకు వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. ‘గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావు. జగన్ గారు వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోంది. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది!’ అని ట్వీట్ చేశారు.
గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావు. జగన్ గారు వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోంది. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోంది!
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 5, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, AP Politics, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ycp